Share News

నేడే తుది తీర్పు

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:51 AM

జిల్లాలో బుధవారం జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

నేడే తుది తీర్పు
సుల్తానాబాద్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ కేంద్రంలో పోలింగ్‌ సిబ్బంది

(ఆంరఽధజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో బుధవారం జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌ సామగ్రిని తమకు కేటాయించిన వాహనాల్లో తీసుకవెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించ నున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. అలాగే ఉప సర్పంచులను కూడా అదే రోజు ఎన్నుకోనున్నారు. మూడో విడతలో ఎలిగేడు, ఓదెల, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మండలాల్లోని 91 గ్రామ పంచాయతీలు, 684 వార్డు స్థానా లకు ఈ నెల 3వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్లు స్వీకరిం చారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా పెద్దపల్లి మండలం రాంపెల్లి, ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లె సర్పంచ్‌ స్థానాలతో పాటు మొత్తం వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎలిగేడు మండలం ర్యాకల్‌ దేవ్‌పల్లి, సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లి, రామునిపల్లి, నారాయణ రావుపల్లె సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు మండలాల్లో కలిసి 215 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 89 గ్రామ పంచాయతీల్లో 85 సర్పంచ్‌ స్థానాలకు, 634 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 85 సర్పంచ్‌ స్థానాలకు 300 మంది అభ్యర్థులు, 634 వార్డు స్థానాలకు 1797 మంది అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 684 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి 2500 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. 67 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్‌కాస్టింగ్‌తోపాటు పెద్ద ఎత్తున పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బంది ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలకు మంగళవారం చేరుకుని పోలింగ్‌ సామగ్రిని తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, ఎలిగేడు మండ లాల్లోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు చేరుకుని పరిశీలించారు. సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వారం రోజుల పాటు విస్తృతంగా ప్రచా రం నిర్వహించిన అభ్యర్థుల భవితవ్యం బుధవారం తేల్చనున్నారు.

ఫ మండలాల వారీగా ఓటర్ల వివరాలు..

---------------------------------------------------------------------------

మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

---------------------------------------------------------------------------------

ఎలిగేడు 9088 9481 1 18570

ఓదెల 17588 18219 0 35807

పెద్దపల్లి 24989 25996 1 50986

సుల్తానాబాద్‌ 19227 19973 0 39200

---------------------------------------------------------------------------------

మొత్తం 70892 73669 2 144563

---------------------------------------------------------------------------------

Updated Date - Dec 17 , 2025 | 12:51 AM