Share News

నేడు మొహర్రం

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:09 AM

మొహర్రం ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో తొలి నెల, కొత్త సంవత్సర ప్రారంభానికి సూచిక. మొహర్రం మాసం 10వ రోజున వచ్చే రోజుని అషురా అని పిలుస్తారు. ఇది విషాదానికి, సంతాపానికి చెందినది. రాచరిక వ్యవస్థ నశించి ప్రజాస్వామ్య పాలన రావాలని కోరుతూ మహమ్మద్‌ ప్రవక్త మనుమలైన హసన్‌, హుస్సేన్‌లు కర్బలా మైదానంలో యుద్ధం చేసి కుటుంబ సభ్యులు, అనుచరులతో సహా వీరమరణం పొందుతారు

నేడు మొహర్రం
సిద్ధంగా ఉన్న పీరీలు

కరీంనగర్‌ కల్చరల్‌, జూలై 5: మొహర్రం ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో తొలి నెల, కొత్త సంవత్సర ప్రారంభానికి సూచిక. మొహర్రం మాసం 10వ రోజున వచ్చే రోజుని అషురా అని పిలుస్తారు. ఇది విషాదానికి, సంతాపానికి చెందినది. రాచరిక వ్యవస్థ నశించి ప్రజాస్వామ్య పాలన రావాలని కోరుతూ మహమ్మద్‌ ప్రవక్త మనుమలైన హసన్‌, హుస్సేన్‌లు కర్బలా మైదానంలో యుద్ధం చేసి కుటుంబ సభ్యులు, అనుచరులతో సహా వీరమరణం పొందుతారు. వారి త్యాగనిరతిని, అమరత్వాన్ని స్మరిస్తూ ముస్లింలు మొహర్రంను జరుపుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. పేదలకు సాయం చేస్తారు. ఉపవాసం పాటిస్తారు. అధర్మం, అన్యాయాలను వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుబడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని ప్రార్థిస్తారు. ఆదివారం పాతబజార్‌లోని ప్రాచీన జామా మజీద్‌ వద్ద నెలకొల్పిన పీరీలను కుల మత బేధం లేకుండా హిందూ ముస్లింలు దర్శించుకుంటారు. ముస్లింలు షర్బత్‌ పంపిణీ చేస్తారు. ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు పీరీల దర్శనం కొనసాగనుంది. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:09 AM