ఉన్నత స్థానాలకు ఎదగాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:46 AM
ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి ఉన్న త స్థానాలకు ఎదగాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరి మ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు.
బోయినపల్లి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి ఉన్న త స్థానాలకు ఎదగాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరి మ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. బోయినపల్లి మోడల్ స్కూల్‌లో మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బం ది హాజరు, విద్యాలయం ఆవరణ, మధ్యాహ్న భోజనం మెనూ, తయారీని పరిశీలించారు. మెనూ ప్రకారం ఏ ఆహారపదార్థాలను సిద్ధం చేస్తున్నారో అడిగి తెలుసుకు న్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్వా హకులకు సూచించారు. తరగతి గదిలో ఇం గ్లీష్ పాఠం కొనసాగుతుండగా పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రతి రోజూ స్కూల్ కు రావాలని విద్యార్థులకు సూచించారు. సిలబస్ ఫిబ్రవరి లో పూర్తి చేయాలని, వార్షిక పరీక్షలకు సాధన చేయించాల ని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులందరూ అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని, ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడేలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.