Share News

దేశభక్తి, చైతన్యాన్ని పెంపొందించడానికే తిరంగా ర్యాలీ

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:50 AM

ప్రజలల్లో దేశభక్తితో పాటు చైతన్యాన్ని పెంపొందించడం కోసమే హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నా రు.

దేశభక్తి, చైతన్యాన్ని పెంపొందించడానికే తిరంగా ర్యాలీ

సిరిసిల్ల రూరల్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రజలల్లో దేశభక్తితో పాటు చైతన్యాన్ని పెంపొందించడం కోసమే హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నా రు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్‌ నేతన్న చౌరస్తా నుంచి ప్రారంభ మైన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ అంబేద్కర్‌ చౌరస్తాల మీదుగా గాంధీ చౌక్‌ వరకు చేపట్టారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో గోపి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చి 78 సంవత్సరాలు పూర్తిచేసుకు ని 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశ ప్రజల్లో చైతన్యాన్ని, దేశభక్తిని నింపడంతోపాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా లను ఎగురవేయాలనే సంకల్పంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరుగు తుందన్నారు. ప్రపంచ దేశాలు నివ్వరపోయే విధంగా అపరేషన్‌ సింధూర్‌ చేపట్టామని, శత్రు దేశాల నుంచి భారతదేశాన్ని రక్షించడంలో ముందున్నామన్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఆర్థికపరంగా నాలుగో స్థానం నుంచి మూడో స్థానంలోకి వస్తున్నట్లు దేశ ప్రదాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, కరీంనగర్‌ పార్లమెంటరీ కో-కన్వీనర్‌ అడెపు రవీందర్‌, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మ్యాన రాంప్రసాద్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్‌, ఎర్రం మహేష్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, పట్టణ అధ్యక్షురాలు వేము ల వైశాలి, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు నాగుల శ్రీనివాస్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:50 AM