Share News

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:37 AM

ప్రశాంత వాతావరణంలో, పారదర్శ కంగా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎస్పీ మహేష్‌ బీ గితే తెలిపారు.

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

సిరిసిల్ల, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రశాంత వాతావరణంలో, పారదర్శ కంగా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎస్పీ మహేష్‌ బీ గితే తెలిపారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి పోలీస్‌ స్టేషన్లలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీ స్‌ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రెండవ విడత ఎన్నికల నిర్వహణకు 700 మంది పోలిస్‌ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 26 రూట్‌ మొబైయిల్‌ బృందాలు, ఏడు జోనల్‌, మూడు క్విక్‌ రియాక్షన్‌, రెండు స్ట్రయికింగ్‌ ఫోర్స్‌ బృందాలు ఏర్పాటుచేశామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది పోలింగ్‌, కౌంటింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్‌ కేంద్రాలను వదిలివెళ్లరాదని సూచించారు. రూట్‌ మొబైల్‌ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రో లింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద లేదా రూట్లలో ఎన్ని కల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైనా వెం టనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ప్రజలు పాటిస్తూ, పోలీసులకు సహకరించి స్వేచ్ఛాయు త వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ని యమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో 9 కేసులు నమో దు కాగా రూ 23.28 లక్షల నగదు సీజ్‌ చేశామని తెలిపారు. అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి సారించి నిర్వహించిన దాడుల్లో 93 కేసుల్లో 1387 లీటర్ల మద్యం సీజ్‌ చేశామని, 224 కేసుల్లో 782మందిని బైండోవర్‌ చేశామన్నారు. శాంతి భద్ర తలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే, ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం లో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు, ఎస్‌ఐ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:37 AM