Share News

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:40 AM

పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఐ రాణికుముదిని ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఐ రాణికుముదిని ఆదేశించారు. బుధవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. రాజ న్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌ హాజ రయ్యారు. సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిందని, డిసెంబరు 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్‌డేట్‌ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్‌ ఉంటుంది, పోలింగ్‌ కేంద్రాల జియోలోకేషన్‌ వివరాలు వెంటనే టీ-పోల్‌ వెబ్‌సైట్‌, యాప్‌లో నమోదు చేయాలన్నారు. టీ-పోల్‌ వెబ్‌సైట్‌, యాప్‌లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్‌ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. ఫైనల్‌చేసిన ఓటర్‌ జాబి తా, పోలింగ్‌ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరు గుతుందని తెలిపారు. రెండుకంటే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న భవ నం దగ్గర హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని, వెబ్‌క్యాస్టింగ్‌ జరిగే పోలింగ్‌ కేంద్రాల వివరాలు పంపాలని, పోలింగ్‌ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్‌, పవర్‌ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.

నేడు మొదటి విడత నోటిఫికేషన్‌

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ నవంబరు 27న ఉదయం 10.30గంటల వరకు విడుదల చేయాలన్నారు. నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధి లోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలన్నారు. నవంబరు 27 నుంచి 29వరకు ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు వద్ద నామినేషన్‌ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లుచేయాలన్నారు. నామినేషన్ల పరిశీలన నవం బరు 30న సాయంత్రం 5గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైన నామినే టెడ్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలన్నారు. అభ్యర్థుల జాబితాపై అప్పీ ళ్ల కోసం డిసెంబరు 1, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్‌ 2ను అప్పీళ్లు పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్‌ 3 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుందని, అదేరోజు పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలన్నారు. నామినేషన్ల స్వీక రణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్య ర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీచేయాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అను మతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదే శాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌లకు ఎన్నికల కమిషనర్‌ సూచించారు. ప్రతి జిల్లాలో ఎంసీఎంసీ కమిటీ, జిల్లా మీడియా సెల్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలకా్ట్రనిక్‌ వీడియోలకు ముందుగా ఎంసీ. ఎంసీ అనుమతి ఉండాలన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపథ్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిస రిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎంసీఎంసీ అమ లులో నిర్వహించే తనిఖీలలో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్‌ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్‌ చేసిన పరికరా లకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హా జరు కావాలనే వివరాలు ఆ రసీదులో ఉండాలని అన్నారు.

నామిషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

- ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌

గ్రామ పంచాయతీల రిజర్వేషన్‌ వివరాలు టీ-పోల్‌లో అప్‌లోడ్‌ చేశామ ని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌ తెలిపారు. మొదటి విడతగా గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నా రు. ఎంసీఎంసీ, మీడియా సెల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శేషాద్రి, డీపీవో శర్ఫుద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:40 AM