Share News

పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - May 11 , 2025 | 12:24 AM

జిల్లాలో నిర్వహించే పాలిసెట్‌ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లతో పాటు ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయా లని సంబంధిత అధికారులను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అదేశించారు.

పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహించే పాలిసెట్‌ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లతో పాటు ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయా లని సంబంధిత అధికారులను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివా రం పాలిసెట్‌ నిర్వహణపై సంబంధిత అధి కారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈనెల 13న నిర్వహించే పాలిసెట్‌ నిర్వహణలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాల న్నారు. పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సుల్లో ప్రవేశా నికి విద్యార్థులకు జరిగే పరీక్షలు ఉదయం 11గంట నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు టీజీ పాలిసెట్‌ సజావుగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో పాలిసెట్‌ నిర్వహణ కోసం 7 కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 2,136 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించా రు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవస రమైన బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధి కారులను అదేశించారు. పశ్న పత్రాల తరలిం పునకు అవసరమైన బందోబస్తును పోలీసు లు కల్పించాలన్నారు. పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద కరెంట్‌ కోతలు ఉండవద్దని, ఫస్ట్‌ ఎయిడ్‌కిట్‌, ఓఆర్‌ ఎస్‌ ప్యాకెట్‌లతో పాటు మెడికల్‌ క్యాంపు లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావే శంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల అర్డీవో వెంకటేశ్వర్లు, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకరాచారీ, జిల్లా వైధ్యాధికారి డాక్టర్‌ రజిత, సిరిసిల్ల తహసీల్ధాఽర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:24 AM