Share News

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:23 AM

రాజన్న సిరిసి ల్ల జిల్లాలో ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్‌, పదవ తరగతి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల ని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు.

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసి ల్ల జిల్లాలో ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్‌, పదవ తరగతి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల ని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇంటర్‌, పదవ తరగతి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారుల తో గురువారం సమన్వయ కమిటీతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రశ్న పత్రాలను, కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరాదని, గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ కేంద్రాలకు అనుమతించరాదని ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షల కోసం జిల్లాలో 4 సెంటర్లు (సిరిసిల్ల 2, వేములవాడ 2) ఏర్పా టు చేస్తున్నామని, 995 మంది అభ్యర్థులు, 10వ తరగతి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల కోసం ఒక సెంటర్‌ సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నామ న్నారు. 264 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. వేసవి దృష్ట్యా వైద్య శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాల న్నారు. ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మహిళా పోలీస్‌ సిబ్బందికి డ్యూటీ కేటాయించాలని సూచించారు. కేంద్రాల్లో పరీక్ష రాసేవారికి వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి జనార్ద న్‌రావు, జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయనియంత్రణ అధికారి, పోలీసు, వైద్య ఆరోగ్య, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ,పోస్టల్‌, ఇంటర్మీడియట్‌ విద్య, ఆర్టీసీ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:23 AM