Share News

మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - May 16 , 2025 | 12:07 AM

రుద్రంగిలో శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఆదేశించారు.

మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

రుద్రంగి, మే, 15(ఆంధ్రజ్యోతి) : రుద్రంగిలో శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఆదేశించారు. రుద్రంగి మండల కేంద్రంలో మంత్రుల పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, ఎస్పీ మహేష్‌ బి గితేలతో కలిసి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ గురువారం రుద్రంగి గ్రామపంచాయతీ కార్యాల య ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ భూ సమస్య ల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్‌ చట్టం, భూ భారతి చట్టం పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో రెవెన్యూ సద స్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రుద్రంగి మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్ర మం కూడా హౌసింగ్‌ శాఖ మంత్రి చేతుల మీదుగా జరుగుతుందని తెలిపారు. అలాగే రుద్రంగిలోని బస్టాండ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొనన్నుట్లు తెలిపారు. రుద్రంగిలో ఇంటి కోసం పేదలు చేసుకున్న దరఖాస్తులు ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉంటే వెంటనే మంజూరు చేయాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రి పర్యటనకు రైతులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రుద్రంగిలో పర్యటించనున్నారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. రుద్రంగి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని, సంబంధిత ప్రజా ప్రతినిధులను ప్రొటొకాల్‌ ప్రకారం ఆహ్వానించాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు సూచించారు. రెవెన్యూ సదస్సుల వద్ద పారిశుధ్య నిర్వహణ, లైటింగ్‌ మొదలగు ఏర్పాట్లను ఎంపీడీవో పకడ్బందీగా పూర్తిచేయాలన్నారు. హెలిపాడ్‌ వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని, టెంట్‌, కుర్చీలు, సభావేదిక వంటి ఏర్పాట్లను ఆర్‌అండ్‌బీ అధికారి పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అంబులెన్స్‌ అందుబాటులో పెట్టాలని, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సమావేశం వద్ద ఫైర్‌ ఇంజన్‌ అందుబాటులో పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి ప్రారంభించే కార్యక్రమ ఇంటి స్థలాలు, హెలిప్యాడ్‌, బహిరంగ సభా వేదిక, రెవెన్యూ సదస్సులు జరిగే సభా వేదిక, గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి సహాయ కేంద్రం వంటివి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాధాబాయి, రుద్రంగి తహాసీల్దార్‌ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తూమ్‌ జలపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, తర్రె మనోహర్‌, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, గండి నారాయణ, పల్లి గంగాధర్‌, మాడిశెట్టి అభిలాష్‌, సూర యాదయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 12:07 AM