ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:13 AM
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమినషర్ రాణి కుముదిని ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమినషర్ రాణి కుముదిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరె న్స్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహే ష్‌బీ గీతే, జిల్లా ఎన్నికల పరిశీలకులు రవికుమార్, వ్యయ పరిశీలకులు రాజ్‌కు మార్‌లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కుముదిని మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలె ట్ ఓటు హక్కు అందేలా రిటర్నింగ్ అధికారి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి ప్రలోభాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత పోటీ చేసే అభ్యర్థుల గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్లపై ముద్రణ నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలన్నారు. సింగిల్ నామినే షన్ వచ్చిన గ్రామాలు ఉంటే అండర్‌టేకింగ్ తీసుకోవాలని, సర్పంచ్ పదవుల వేలం ప్రక్రియ ఎక్కడ జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ స్లిప్ ల పంపిణీకి షెడ్యూలు తయారు చేయాలని, ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిచేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలె ట్ పత్రాలు అవసరమైన మేర అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో అంతర్ జిల్లాల చెక్ పోస్ట్‌ల ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నా మన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ శేషాద్రి, డీషీవో షరీఫుద్దిన్, జిల్లా సంక్షమా ధికారి లక్ష్మీరాజం, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, నోడల్ అధికారి నవీన్, ఏవో రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.