Share News

జగిత్యాల జిల్లాలో జోరుగా మూడు ముక్కలాట

ABN , Publish Date - May 16 , 2025 | 12:34 AM

జిల్లాలో మూడుముక్కలాట జోరుగా సాగుతోంది.

జగిత్యాల జిల్లాలో జోరుగా మూడు ముక్కలాట

జగిత్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. మామిడి తోటలు, వ్యవసాయ భూములు, పల్లెల శివారు ప్రాంతాలు పేకాటకు అడ్డాగా మారుతున్నాయి. కొందరు వేడుకల పేరు తో మద్యం, హుక్కా, గంజాయి మత్తులో తూలుతున్నారు. అదే సమ యంలో మూడు ముక్కలాటను సైతం కొనసాగిస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ వంటి పట్టణాలు, మండల కేంద్రాలకు చేరువలో ఉన్న శివారు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇటువంటి పేకాట అడ్డాలున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట పేకాట కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మద్యం, డ్రగ్స్‌ సైతం వినియోగి స్తున్నారు. దేవస్థానాల శివారు ప్రాంతాలు, పట్టణాలకు చేరువలో ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యవహారం ఎక్కువగా నడుస్తోంది.

ఒక్కొక్కరుగా చేరుకుంటూ గుంపుగా..

జనవాసాలకు దూరంగా ఉండే మామిడి తోటలు, పంట పొలాలు, చెరువు గట్టులు, గోదావరి తీర ప్రాంతాలను వేదికగా చేసుకొని జూదాన్ని కొనసాగిస్తున్నారు. పేకాట కోసం ప్రత్యేక టెంటు, కుర్చీలు, టేబుళ్లు సైతం కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. పేకాట రాయుళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆహార పదార్థాలను సైతం అందిస్తున్నారు. ఇందు కొరకు ప్రత్యేక వ్యక్తులను నియమించుకుంటు న్నారు. దూరం నుంచి ఎవరైనా గమనిస్తే వన భోజనం చేసుకుంటు న్నట్లు కనిపిస్తోంది. పేకాట రాయుళ్లకు భోజనం, మందును కూడా అందిస్తున్నారు. నిర్వాహకులు స్థావరం ఏర్పాటు చేసిన ప్రాంత సమా చారాన్ని పేకాట రాయుళ్లకు రహస్యంగా అందిస్తున్నారు. ఒక్కొక్కరుగా స్థావరానికి చేరుకుంటారు. ఇలా ఎవరూ గుర్తించకుండా అడ్డాలు మారుస్తూ పేకాట నిర్వహిస్తున్నారు. పేకాట స్థావరాల వద్దకు ఇతరులు ఎవరైనా వస్తే మందస్తుగా సమాచారం ఇవ్వడానికి సెంట్రీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం స్థానిక నేతలకు తెలిసినప్పటికీ పోలీ సులకు సమాచారం ఇవ్వడం లేదు. వాటిని అడ్డుకోవడానికి ప్రయ త్నించడం లేదు.

సరదాతో మొదలై వ్యసనంగా...

కొందరు సరాదా కొరకు మొదలెట్టిన పేకాట వ్యసనంగా మారుతోంది. జిల్లాలో పేక మూడు ముక్కలు, ఆరు మాముళ్లుగా సాగుతోంది. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్న పేకాట నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ప్రయత్నం చేస్తుంటే మరో వైపు సులువుగా డబ్బులు సంపా దించాలన్న అత్యాశతో కొందరు దళారులు పేకాట స్థాపవరాలు ఏర్పాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కింది స్థాయి అధికారులు మాముళ్ల మత్తులో పరోక్షంగా ఆటను ప్రోత్సహిస్తున్నారు. దీంతో జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. రాజకీయ పలుకుబడి గల కందరు చోటా మోటా నాయకులు, వ్యాపారులు ఈ దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి పేకాట రాయుళ్లను పట్టుకుంటు న్నా స్వాధీనం చేసుకున్న డబ్బుల్లో కొంత స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టుబడ్డ వారిలో కొందరిని అరెస్టు చూపుతూ మిగితా వారిని వదిలివేస్తున్నారన్న విమర్శలు ఉంటున్నాయి.

రమ్మీ, మూడు ముక్కలాటలు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట శిభిరాల్లో ఎక్కువగా రమ్మీ, మూడు ముక్కలాటలు నిర్వహి స్తున్నారు. తొమ్మిది మందితో కెనెస్టా ఆటను ఆడిస్తున్నారు. డబ్బులు పెట్టి స్థాయిని బట్టి గ్రూపులుగా విభజించి ఆట ఆడిస్తున్నారు. రూ. 1,000 మొదలుకొని రూ. 20,000 వరకు ఆటలు నిర్వహిస్తున్నారు. రమ్మీ ఆటను అయితే ఏడుగురితో, కెనెస్టా ఆటను తొమ్మిది మందితో నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన రూ. 5 వేల ఆట నిర్వహిస్తే రూ. 35 అవుతుంటాయి. నిర్వా హకుడు ఆటకు రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు కమీషన్‌ తీసుకుంటున్నారు. ఖర్చులు పోను రోజు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు సంపాదిస్తున్నారు. తాము తీసుకుంటున్న కమీషన్‌ నుంచి సంబంధిత అధికారులకు వారం, పక్షం, నెలవారీగా మాముళ్లు అందిస్తుం టారని సమాచారం. వ్యసనంగా మారిన పేకాటలో తాము పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదిస్తామన్న అత్యాశతో అప్పులు చేసి ఆడుతున్నారు. అప్పులు చేయడమే కాకుండా భార్య మెడల్లోని పుస్తెల తాడు అమ్మి పేకాటలో డబ్బులు కోల్పోయిన జూదరులు కూడా ఉన్నారు. కొందరు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు రోజూ జూదం ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. పేకాట రాయుళ్లు, పొగ రాయుళ్లు, మందు బాబుల ఆగడాలతో ఘర్షణలు జరుగుతున్నాయి.

అద్దె గదుల్లో ఆట

జిల్లాలోని పలు ప్రధాన పట్టణాల్లో అద్దె గదుల్లో పేకాట ఆడుతు న్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఆడుతుంటారు. మరి కొందరు స్నేహితుల ఇళ్లలో పేకాట ఆడుతున్నారు. పొరుగు జిల్లాలైన నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చి పేకాట ఆడుతున్నారు. పట్టుబడి అరెస్టు అయినప్పటికీ వ్యసనం వదల కుండా మళ్లీ పేకాట ఆడుతున్నారు.

కీలకంగా సీసీఎస్‌ పోలీసులు

పేకాట నియంత్రించడంలో సీసీఎస్‌ పోలీసులు కీలకంగా వ్యవహ రిస్తున్నారు. మూడు, నాలుగు నెలలుగా పట్టుపడుతున్న పేకాట రాయుళ్ల ఘటనలను పరిశీలిస్తే సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. స్థానిక పోలీసులకు వివిధ బాధ్యతలు ఉండడం ఒక్క కారణమైతే, పేకాట రాయుళ్లు, నిర్వహణదారులతో సత్సంబంధాలు కలిగి ఉండి చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడం వల్ల సీసీఎస్‌ పోలీసులు దృష్టి సారించాల్సి వస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీసీఎస్‌ పోలీసులకు వచ్చే సమాచారం స్థానిక పోలీసులకు ఎందుకు రావడం లేదు. ఒక వేళా వచ్చినా పట్టించుకోవడం లేదా...అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు మరింత ఎక్కువ దృష్టి సారిస్తే పేకాటను నియంత్రించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిరంతరం దాడులు నిర్వహిస్తున్నాం

- అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్పీ, జగిత్యాల

పేకాట ఆడుతూ జీవితాలను నాశనం చేసుకోవద్దు. జూదం ఆడి డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశ ఉండకూడదు. దీనివల్ల ఎక్కువ శాతం నష్టమే జరుగుతుంది. పేకాట ఆడుతూ పట్టుబడ్డ, నిర్వహణ స్థావరాలు ఏర్పాటు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పోలీసులు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు..

ఫ ఈ నెల 7వ తేదీన జిల్లాలోని ధర్మపురి మండలం దొంతాపూర్‌ శివారులో పేకాట శిబిరంపై సీసీఎస్‌ పోలీసులు దాడి చేశారు. ఆరుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు రూ. 26,060 వేలు, 6 మొబైల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

ఫ గత నెల 28వ తేదీన రాయికల్‌ మండలం మైతాపూర్‌, జగిత్యాల పట్టణంలోని భవానినగర్‌లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు సీసీఎస్‌ పోలీసులు సోదాలు చేశారు. రెండు ఘటనల్లో 8 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు రూ. 17,875 నగదు, 8 మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఫ గత నెల 19వ తేదీన కోరుట్ల మండలం వెంకటాపూర్‌ గ్రామ శివా రులో సీసీఎస్‌ పోలీసులు సోదాలు నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 17,060 నగదు, 5 మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఫ గత నెల 19వ తేదీన మేడిపల్లి మండలం కల్వకోట శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద రూ. 11,100 నగదు, ఏడు మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - May 16 , 2025 | 12:34 AM