Share News

తొలి విడతలో ముగ్గురు ఏకగ్రీవం

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:26 AM

పంచాయతీ ఎన్నికల తొలి విడతలో ముగ్గురు మహిళలు ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు.

తొలి విడతలో ముగ్గురు ఏకగ్రీవం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పంచాయతీ ఎన్నికల తొలి విడతలో ముగ్గురు మహిళలు ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. మొదటి విడుత ఎన్నికలు జరుగుతున్న 92 పంచాయతీల్లో మూడు పంచాయతీల సర్పంచు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 89 పంచాయతీల సర్పంచు పదవులకు 387 మంది పోటీలో ఉన్నారు. అలాగే ఆయా పంచాయతీల్లోని 866 వార్డు సభ్యుల పదవులకు 270 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగతా వార్డులకు 1581 మంది పోటీలో ఉన్నారు. బుధవారం తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత చొప్పదండి మండలం పెద్దకురుమపల్లి గ్రామ సర్పంచు పదవి జనరల్‌ మహిళకు రిజర్వుకాగా మావురం సుగుణ (ఇండిపెండెంట్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే రామడుగు మండలం శ్రీరాములపల్లి సర్పంచు పదవి జనరల్‌ మహిళకు రిజర్వు కాగా ఒంటెల సుగుణమ్మ (బీఆర్‌ఎస్‌)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింగిల్‌ నామినేషన రావడంతో చొప్పదండి మండలానికి చెందిన దేశాయిపేట గ్రామ సర్పంచుగా వడ్లకొండ తిరుమల (ఇండిపెండెంట్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గంగాధర మండలంలో 33 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచు స్థానాలకు 138 మంది బరిలో ఉన్నారు. 296 వార్డులకు 102 వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవం అయింది. మిగిలిన 194 వార్డులకు 583 మంది పోటీ పడుతున్నారు. చొప్పదండి మండలంలో 16 గ్రామపంచాయతీల్లో దేశాయిపేట, పెద్దకురుమపల్లి పంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 14 సర్పంచు పదవులకు 68 మంది పోటీపడుతున్నారు. ఈ మండలంలోని 154 వార్డులకు 53 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగతా 101 వార్డులకు 240 మంది పోటీలో ఉన్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 14 పంచాయతీలలో సర్పంచు పదవులకు 57 మంది బరిలో ఉన్నారు. 132 వార్డులకు 32 వార్డుల్లో సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 100 వార్డులకు 246 మంది పోటీపడుతున్నారు. రామడుగు మండలంలోని 23 గ్రామపంచాయతీల్లోని 23 సర్పంచు స్థానాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా మిగిలిన 22 సర్పంచు స్థానాల్లో 94 మంది పోటీలో ఉన్నారు. 222 వార్డుల్లోని 81 వార్డులు ఏకగ్రీవంగా కాగా, మిగిలిన 141 వార్డుల్లో 354 మంది పోటీలో ఉన్నారు. కొత్తపల్లి మండలంలోని 6 గ్రామపంచాయతీల్లోని ఆరు సర్పంచు స్థానాలకు 30 మంది పోటీలో ఉండగా, 62 వార్డుల్లో 8 వార్డుల సభ్యులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 54 వార్డుల్లో 158 మంది పోటీలో ఉన్నారు.

ఫ రెండవ విడత నామినేషన్ల పరిశీలన పూర్తి :

రెండవ విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో సర్పంచు, వార్డుసభ్యుల నామినేషన్ల పరిశీలన బుధవారం పూర్తయింది. తిమ్మాపూర్‌, మానకొండూర్‌, చిగురుమామిడి, గన్నేరువరం, శంకరపట్నం గ్రామపంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం 113 సర్పంచు స్థానాలకు 724 మంది, 1046 వార్డులకు 2858 మంది పోటీలో ఉన్నారు. తిమ్మాపూర్‌ మండలంలోని 23 సర్పంచు పదవులకు 114 మంది, 212 వార్డుసభ్యుల పదవులకు 589 మంది, మానకొండూర్‌ మండలంలోని 29 సర్పంచు పదవులకు 202 మంది, 280 వార్డు పదవులకు 821 నామినేషన్లు దాఖలయ్యాయి. చిగురుమామిడి మండలంలోని 17 సర్పంచు పదవులకు 97, 174 వార్డు పదవులకు 496, గన్నేరువరం మండలంలోని 17 సర్పంచు పదవులకు 85 నామినేషన్లు, 140 వార్డులకు 304 నామినేషన్లు, శంకరపట్నం మండలంలోని 27 సర్పంచు పదవులకు 226 నామినేషన్లు, 240 వార్డు పదవులకు 648 నామినేషన్లు వచ్చాయి. గురువారం అభ్యంతరాలేమైనా ఉంటే అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. శుక్రవారం అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. గన్నేరువరం మండలం

Updated Date - Dec 04 , 2025 | 01:26 AM