మూడున్నర నెలలపాటు ‘సమగ్ర ఆరోగ్య ప్రచారం’
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:02 AM
సమగ్ర ఆరోగ్య ప్రచారం (ఇంటిగ్రేటెడ్ హెల్త్ కాంపెయిన్) కార్యక్రమాన్ని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ప్రారంభించారు.
సుభాష్‌నగర్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): సమగ్ర ఆరోగ్య ప్రచారం (ఇంటిగ్రేటెడ్ హెల్త్ కాంపెయిన్) కార్యక్రమాన్ని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1 నుంచి సెప్టెంబరు 15 వరకు మూడున్నర నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో హెచ్‌ఐవీ, సిఫిలిస్ టెస్టింగ్, క్షయ వ్యాధికి సంబందించిన పరీక్షలు, షుగర్, హైబీపీకి సంబందించిన పరీక్షలు, వైరల్ హెపటైటీస్‌లైన హెపటైటీస్-బి, హెపటైటీస్-సీ, హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు చేస్తారని తెలిపారు. తిమ్మాపూర్ పీహెచ్‌సీ పరిధిలోని సబ్ సెంటర్‌లో సమగ్ర ఆరోగ్య ప్రచారానికి సంబంధించిన హెల్త్ క్యాంపును అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ సాజిదా, పీవోడీటీ డాక్టర్ ఉమాశ్రీ, ఎంసిహెచ్‌పీవో డాక్టర్ సనాజవేరియా, డెమో రాజగోపాల్, డీపీఎం స్వామి, సురేందర్, మొబైల్ ఐసీటీసీ టీమ, ఎన్‌జీవో పద్మపాని, లింక్ వర్కర్స్ సిబ్బంది పాల్గొన్నారు.