నేటి నుంచి మూడో విడత నామినేషను
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:44 AM
మూడో విడతలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మూడో విడతలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈనెల 5 వరకు మూడురోజుల పాటు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ విడతలో హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాలకు చెందిన 111 గ్రామపంచా యతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 111 సర్పంచు పదవులకు, 1,034 వార్డు సభ్యుల పదవులకు బుధ వారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబరు 6న నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటయిన నామినేషన్ల వివరాలను ప్రకటిస్తారు. 7న నామి నేషన్లపై అభ్యంతరాలుం టే అప్పీలు చేసుకు నేం దుకు అవకాశం కల్పిస్తారు. 8న అప్పీళ్లను పరిశీ లించి పరిష్కరిస్తారు. 9న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవ కాశం ఉం టుంది. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబరు 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహి స్తారు. హుజూరాబాద్ మండలంలో 20 గ్రామ పంచాయతీల సర్పంచ్, 196 వార్డు సభ్యుల పదవులకు, వీణవంకలో 26 సర్పంచ్, 246 వార్డు సభ్యులు, జమ్మికుంటలో 20 సర్పంచ్, 188 వార్డు సభ్యులు, ఇల్లందకుంట మండలంలో 18 సర్పంచ్, 166 వార్డు సభ్యులు, సైదాపూర్ మండలంలోని 27 సర్పంచ్, 238 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగను న్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 1,034 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని నియమించారు.
ఫ మొదటి విడత పంచాయతీల్లో
నేడు ఉపసంహరణ
మొదటి విడతలో ఎన్నికలు జరిగే గ్రామపంచా యతీల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 3 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తారు. మొదటి విడతలో ఎన్నికలు జరిగే 92 పంచాయతీల్లో 92 సర్పంచ్ పదవులకు 730 నామినేషన్లు, 866 వార్డు సభ్యుల పదవులకు 2,174 నామినేషన్లు వచ్చాయి. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను, అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను ప్రకటిస్తారు. ఈ నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కించి ఫలితాలను వెల్లడించి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.
ఫ రెండో విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి
ఈనెల 14న పోలింగ్ జరుగనున్న రెండో విడత
(మిగతా 8వ పేజీలో)
సమస్యాత్మక కేంద్రాల వద్ద
అదనపు బలగాలు
(5పేజీ తరువాయి)
గ్రామపంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. ఈ విడతలో చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూర్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మండలాల్లోని 113 సర్పంచ్ పదవులకు --- నామినేషన్లు, 1046 వార్డు సభ్యుల పదవులకు ---- నామినేషన్లు వచ్చాయి. ఈ నామినేషన్ల పరిశీలన ఈనెల 3న జరుగుతుంది. చెల్లుబాటైన నామినేషన్ల వివరాలపై అభ్యంతరాలుంటే ఈనెల 4న అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్లను 5న పరిశీలించి పరిష్కరిస్తారు. ఈనెల 6 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈనెల 14న రెండో విడత పోలింగ్ జరుగుతుంది.