పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం
ABN , Publish Date - Aug 04 , 2025 | 01:31 AM
పేదల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శంకరపట్నం మండల కేంద్రంలో రేషన్‌కార్డుల పంపిణీని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు నాసిరకం దొడ్డు బియ్యం పంపిణీ చేసిందని విమర్శించారు.
- బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు
- రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
శంకరపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పేదల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శంకరపట్నం మండల కేంద్రంలో రేషన్‌కార్డుల పంపిణీని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు నాసిరకం దొడ్డు బియ్యం పంపిణీ చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ వ్యవస్థలో విప్లవత్మకమైన, చరిత్రత్మాకమైన మార్పును తీసుకువచ్చిందనిరు. గతంలో పంపిణీ చేసిన దొడ్డురకం బియ్యం తిరిగి ఫౌలీ్ట్ర ఫాములు, రైస్ మిల్లులకు తరలిపోయేదన్నారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని, పాత రేషన్‌కార్డుల్లో సభ్యులను నమోదు చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 8.64లక్షల కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేసిందన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2.81కోట్ల మందికి నాసిరకం దొడ్డు బియ్యం ఇస్తుంటే ప్రస్తుతం 3.17 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. తెలంగాణలోని 84 శాతం మందికి ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలో 55 వేల రేషన్ కార్డులు ఉంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తగా 5,992 రేషన్‌కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. పాత రేషన్‌కార్డుల్లో 13,220 మందిని చేర్చామన్నారు.
లక్ష కోట్లు రైతులకు ఇచ్చాం..
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
పేదలు, బడుగు బలహీన వర్గాలు, రైతాంగ సంక్షేమ కోసం కోసం లక్ష కోట్లు వెచ్చించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయం
- ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
పేదల సంక్షేమమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎంత కష్టమైనా ఇచ్చిన హామీల మేరకు పథకాలను కొనసాగిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సివిల్ సప్లయిస్ కమిషనర్ చౌహాన్, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో రమేష్‌బాబు, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో కృష్ణప్రసాద్, వెలిచాల రాజేందర్‌రావు, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య, కొత్తగట్టు దేవస్థానం చైర్మన్ రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి పాల్గొన్నారు.
సహకార సంఘ భవనం ప్రారంభం
మానకొండూర్: మండలంలోని గట్టుదుద్దెనపల్లి సహకార సంఘం నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అంతకు ముంబ్యాంకు, సింగిల్ విండో వ్వవస్థాపక అధ్యక్షులు అనభేరి వెంకటరమణరావు విగ్రహన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు, సింగిల్ విండో అధ్యక్షులు అనభేరి రాధాకిషన్‌రావు. ఏఎంసీ చైర్మన్ ఓదెలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం
రామడుగు: ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై చట్ట వ్యతిరేకంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆదివారం రామడుగు మండలంలోని షానగర్‌లో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కులను హరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు. మిగులు జలాలపై తెలంగాణ రాష్ర్టానికి ఉన్న వాటా ముందుగా తేలాలని అన్నారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి విమర్శించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.