రాష్ట్రంలో యూరియా కొరత లేదు
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:40 AM
రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామెర రాంసుధాకర్‌రావు అన్నారు.
- రైతులు ఆందోళన చెందవద్దు
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామెర రాంసుధాకర్‌రావు
ధర్మపురి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామెర రాంసుధాకర్‌రావు అన్నారు. ధర్మపురి పట్టణంలో ఆదివారం విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 5.3 లక్షల మెట్రి క్ టన్నుల యూరియా సరఫరా చేసిందని ఆయన అన్నారు. సెప్టెంబరు మొదటి వా రం నాటికి యూరియా సరఫరా కూడా జరుగుతుందని ఆయన తెలిపారు. యూరి యా పంపిణీలో అవకతవకలు జరిగి తేడా రావడం వల్లే గందరగోళ పరిస్థితి ఏర్పడింద ని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా యూరియ సరఫరా జరగడం లేదని పదేపదే చెప్పడం బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే అన్నారు. ఈ విష యంలో రాష్ట్ర మంత్రులు, మిగతా నాయ కులు తమ మాటలు వెనక్కి తీసుకోవా లని ఆయన తెలిపారు. సమావేశంలో ధర్మపురి పట్టణ అధ్యక్షుడు గాజు భాస్క ర్, అసెంబ్లీ కో కన్వీనర్ బండారు లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి బెజ్జారపు లవణ్, ప్రధాన కార్యదర్శి తిరుమన్‌దాసు సత్యనారాయ ణ, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నలుమాసు వైకుంఠం, మండల మాజీ అధ్యక్షుడు సంగెపు గంగారాం, మండ ల ఇన్‌చార్జి ఒగేటి అంజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.