Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదు..

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:45 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్‌ సం దీప్‌కుమార్‌ ఝా స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదు..

తంగళ్లపల్లి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్‌ సం దీప్‌కుమార్‌ ఝా స్పష్టం చేశారు. శనివారం తంగళ్ల పల్లి మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో జిల్ల్లెల్ల గ్రామానికి చెందిన 26మంది లబ్ధిదారులకు ఇందిర మ్మ ఇళ్ల మంజూరు పత్రాలు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, కాంగ్రేస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహీందర్‌రెడ్డి చేతుల మీదుగా ఆందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇళ్ల్లలోకి వెంటనే వెళ్లాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగందని అన్నారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా రాళ్లపేట గ్రామంలో నిర్మిస్తున్న ఇళ్లు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. మండలంలోని ఇందిర మ్మ ఇళ్ల పురోగతిపై పీడీ హౌసీంగ్‌, ఎంపీడీవోలను అభినందించారు. అనంతరం కేకే మహీందర్‌రెడ్డి మాట్ల డుతూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలలో ఇబ్బందులు పడవద్దని అన్నారు. ఏమైన ఇబ్బందులు తలెత్తితే అధి కారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇసుక, మట్టి కొరత లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ నేరెళ్ల నర్సింగంగౌడ్‌, హౌసీంగ్‌ పీడీ శంకర్‌, డీపీవో షర్ఫోద్దీన్‌, ఎంపీడీవో లక్ష్మీనారాయణలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జల్గం ప్రవీణ్‌కుమార్‌, సత్తు శ్రీనివాస్‌రెడ్డి, పొన్నాల పర్శరాములు, ఆరెపల్లి బాలు, ఇట్టిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పెద్దూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మట్టి కోసం ఆందోళన వద్దు..

మట్టి కోసం లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్‌ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ గ్రామంలోని చెరువు, తమకు సంబంధించిన పొలంలో ఉన్న మట్టిని వినియోగిం చుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వాలని అన్నారు. తహసీ ల్దార్‌ అనుమతి తీసుకున్న తర్వాత మట్టిని గృహ నిర్మాణ అవసరాలకు వినియోగించుకునేందుకు అవ కాశం ఉంటుందని స్పష్టం చేశారు.

అన్యాయం చేశారు...

గతంలో అర్హుల జాబితాలో తమ పేర్లు ఉండగా ప్రస్తుతం తమ పేర్లను తొలగించి అన్యాయం చేశారని జిల్లెల్ల చెందిన కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్‌ కార్యలయంలో ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతుండగా.. జిల్లెల్ల గ్రామానికి చెందిన కొంతమంది తమ పేర్లు తొలగించడంపై మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని ఆరోపించారు. రోడ్డు విస్తరణలో తన ఇల్లు కోల్పోతే తనకు డబుల్‌ బెడ్‌రూం ఇస్తామని హామీ ఇచ్చి అర్హుల జాబితాలో గతంలో ప్రకటించారని తెలిపారు. ఇప్పుడు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింప జేశారు. అలాగే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లగా కార్యలయానికి రావాలని పరిశీలించి న్యాయం చేస్తానని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా హామీ ఇచ్చారు.

Updated Date - Jul 13 , 2025 | 12:45 AM