Share News

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:56 AM

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్న నర్సింగరావు

-కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు

కోరుట్ల రూరల్‌, డిసెంబరు 27 (ఆంద్రజ్యోతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్‌ కమిటీలో కోరుట్ల నియోజక వర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మార్కుట్‌ కమిటీ చైర్మన్‌ పన్నాల అంజిరెడ్డితో కలిసి నర్సింగరావు అందించారు. ఈ సందర్బంగా నర్సింగరావు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి చికిత్స నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులను మంజూరు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు సత్యనారాయణ గౌడ్‌, గంగాధర్‌ గౌడ్‌, నేమూరి భూమయ్య, అన్నం అనిల్‌, అడెపు మదు, పుప్పాల ప్రభాకర్‌, ఎంబేరి నాగభూషణం, భూంరెడ్డి, గణేస్‌, సేనాపతిలతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఫఇబ్రహీంపట్నం: మండలంలోని డబ్బా గ్రామంలోని పలువురు గ్రామ యువకులు, మహిళలు కోరుట్ల నియోజవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్‌లో శనివారం చేరారు. డబ్బా గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు పుప్పాల గజేందర్‌ వనతి ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి రూ.2.08 లక్షల చెక్కులను అందించారు. 8వ వార్డు మెంబర్‌ జరుపుల కవితకు ఆయన పార్టీ కండువాకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గూడ శ్రీకాంత్‌, మార్కెట్‌ చైర్మన్‌ బూర్గం రాజు, వైస్‌చైర్మన్‌ వెంకటరెడ్డి, ఉపసర్పంచ్‌ రాపెల్లి మహేష్‌, బుస రాజేశ్వర్‌, మాజీ సర్పంచ్‌ లింగంపల్లి గంగాధర్‌, దూదిగామ గంగాధర్‌, నేరెళ్ల దేవెందర్‌తో పాటు పలువురు నూతన సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు, నాయ కులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:56 AM