రైతన్నల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
ABN , Publish Date - May 05 , 2025 | 12:18 AM
రైతన్నల సం క్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేము లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, మే 4 (ఆంధ్రజ్యోతి) : రైతన్నల సం క్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేము లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా నీటిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుడి కాలువకు నీటిని విడుదల చేయడం జరిగిందని వెల్ల డించారు. మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని 12గ్రామాలకు సాగు నీరు అందనుందని విప్ వెల్లడించారు. ప్యాకేజీ 9లో భాగంగా మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కోనరావుపేట మండలం మల్కపేట, కనగర్తి, నాగారం, పల్లిమక్త, సుద్దాల, రామన్నపేట, మంగళపల్లి గ్రామాలకు, అలాగే వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేశా మని తెలిపారు. మల్కపేట కుడి కాలువకు 250 క్యూసెక్కులు విడుదల చేశామని, దాదాపు 8 వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని విప్ వివరించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల, అంబేద్కర్ సుజల స్రవంతి పేరిట మన ప్రాం తానికి సాగునీరు తీసుకురావడానికి నర్మాలలో ఎగువ మానేరు వరకు సాగునీరు తీసుకపోయే క్రమంలో ఎల్‌ఎండీ కరీంనగర్, మిడ్ మానేరు నిర్మాణం చేసుకొని వరద కాలువను తవ్వుకొని, ఎస్సారెస్పీ ద్వారా మిడ్ మానేరు నింపుకొని అక్కడి నుంచి పంపు చేసుకుని మల్కపేట, ఎగువ మానేరుకు నింపుకోవడానికి 2008లో రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. 2003లో ఉమ్మడి కరీంన గర్ జిల్లాలో పాదయాత్ర భాగంగా నర్మాలలో నిద్ర చేసిన సంద ర్భంగా వేములవాడ, సిరిసిల్ల ప్రాంతం నుంచి వేలాదిమంది వెళ్లా రని గుర్తుచేశారు. 2009లో సుదర్శన్‌రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారని వివరించారు. ఆరోజు ఈ ప్రాజె క్టుకు ప్రాణహిత చేవెళ్ల, అంబేద్కర్ సుజల స్రవంతి అనే పేరు ఉండేదని, తదుపరి పేరు మార్చి కాళేశ్వరం ప్యాకేజీ 9గా పేరు మార్చారని అన్నారు. పదేళ్లుగా పడావుపడ్డ కాలువ పనులను పూర్తిచేసి అందులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించామ ని తెలిపారు. రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో మంత్రు లతో మాట్లాడి ఎల్లారెడ్డిపేట వరకు రైతాంగానికి నీటిని విడుదల చేశామని వివరించారు. ఆరోజు మెయిన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి అక్కపల్లి, బుగ్గరాజేశ్వర తండా, అల్మాస్పూర్, రాజ న్నపేట, దేవునిగుడి తండా, గొల్లపల్లి, బాకృంపల్లి, తిమ్మాపూర్ వరకు నీటిని విడుదల చేశామని చెప్పారు. సుమారు 5000 ఎకరా లకు సాగు నీరు విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా దాన్ని తీర్చే బాధ్యత తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రైట్ మెన్ కెనాల్ ద్వారా సిరిసిల్ల, వేములవాడ, కోనరావుపేట మండలాల్లోని గ్రామాలకు 25,694 ఎకరాల ఆయక ట్టుకు నీరు అందిస్తామన్నారు. భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందజేసి కాలువ పనులు ప్రారంభం చేసి నీటిని విడుదల చేశా మని తెలిపారు. ఎడమ కాలువ కోసం ఇప్పటి వరకు 70 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని, మరో 70 ఎకరాలు భూసేకరణ చేస్తామని పేర్కొన్నారు. గత బకాయిలను కూడా చెల్లించామని విప్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ధనిక, పేద తేడా లేకుండా మేనిఫెస్టోలో చెప్పకున్నా సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే మల్కపేట రామాలయం వరకు 90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
గతంలో తాలు తప్ప పేరిట మోసం..
ఇటీవల కొందరు వరి ధాన్యం కొనుగోలుపై ఆందోళనలు చేశారని, వారు ఒక విషయం తెలుసుకోవాలని.. సిరిసిల్ల జిల్లాలో యాసంగి మే 1 నాటికి 2021-22లో 233 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, 2022-23లో 9 వేల 424 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023-24లో 67 వేల 520 మెట్రిక్ టన్నులు, ఈ సీజన్లో ఈ ఏడాది నిన్నటి వరకు 72 వేల 484 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశామని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. తాను ఒక రైతుతో మాట్లాడితే గతంలో ఏవిధంగా మోసం చేశారో చెప్పారని వివరించారు. తాలు తప్ప పేరుతో రైతులను మోసం చేసి సంచికి 44కిలోలు జోకి రైతులను నిలువునా ముంచారని విమర్శించారు. రైస్ మిల్ల ర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకున్నా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఇంటిగ్రేటెడ్ గోదాములు పెట్టి వడ్లను నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు.
ధర్మారంలో 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం
మహిళ తల్లులను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 600 కోట్లు బ్యాంకు లింకేజి చేశామని పేర్కొన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ విద్యు త్తు ఉత్పత్తి కేంద్రం మంజూరు చేశారని వెల్లడించారు. ఇప్పటికే 30లక్షలతో ఎలక్ట్రిక్ బస్సు మంజూరు చేశామని వివరించారు. మహిళలు ముందుకు వస్తే రైస్ మిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ధరణి చట్టంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారని, వాటిని పరిష్కరించేందుకే భూభారతి చట్టం అమలు చేయనున్నా మని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, ఈ ఈ కిషోర్, డీఈలు సత్యనారాయణ, వినోద్, శ్రీనివాస్, నీటిపారుదల శాఖ అధికారులు, డిఆర్‌డిఓ శేషాద్రి, కోన రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చేపూరి గంగాధర్, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయిని ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగరాజు, పింగళి వెంకన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు మానుక సత్యం, నందు గౌడ్, రుక్మిణి, పెంతల శ్రీనివాస్, ఉప్పుల గంగయ్య, బుర్ర రమేష్, నీరటి సంజీవ్, బొడ్డు రమేష్, నాలుక సత్యం, కర్రోళ్ల భాస్కర్, బుర్ర రవీందర్, బాదనేని బాలరాజు పాల్గొన్నారు.