కన్నుల పండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:52 AM
మండలంలోని బండపల్లి లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు.

చందుర్తి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బండపల్లి లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్స వంలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం ఎదుట కల్యాణోత్సవానికి ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను ఆశీనులను చేశారు. ఆలయ అర్చకులు శ్రీకాంతులచారి ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య కల్యాణం అంగరంగ వైభవంగా చేశారు. గడ్డం తిరుపతిరెడ్డి అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసిం హారావు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెన్నమ నేని వికాస్‌రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు అల్లాడి రమేష్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, పల్లం అన్నపూర్ణ, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై అంజయ్య, నాయకులు గడ్డం లక్ష్మారెడ్డి, కట్కం మల్లేశం, ఏనుగు లచ్చిరెడ్డి, లక్ష్మణ్, ముస్కు పద్మ-మల్లా రెడ్డి, బుర్ర శ్రీనివాస్, మల్యాల గంగనర్సయ్య, లింగంపల్లి బాబు, చిలుక అంజబాబు, సిరికొండ శ్రీనివాస్, మార్త సత్తయ్య, చిర్రం తిరుపతి, మొకిలె విజేందర్ తదితరులు పాల్గొన్నారు.