వక్ ్ఫ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
ABN , Publish Date - May 03 , 2025 | 11:37 PM
రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
గణేశ్‌నగర్, మే 3 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బాధ్యులు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ మూఫతి మహమ్మద్ యూనస్ కాస్మి, కో కన్వీనర్ హఫిజ్ రిజ్వాన్, హఫిజ్ మహమ్మద్ వసీముద్దీన్, మహమ్మద్ మునీబుద్దీన్, మౌలానా ఖాజా కలీముద్దీన్, మౌలానా ఖాజా అలీముద్దీన్, మూఫతి గయాస్ మొహియుద్దీన్, మహమ్మద్ కైరుద్దీన్, మొహమ్మద్ హఫీజ్ ఉల్లా, షా ఖాద్రి, షోయిబ్ అహ్మద్‌ఖాన్, మూఫతి సాదిక్ అలీ, ఉమర్ ఫారూసి కాశ్మీ, రబ్బానీ, బి వెంకట మల్లయ్య, జి రాజయ్య, జయరాజ్, ప్రశాంత్, క్రిస్టఫర్, సర్దార్ బిషన్ సింగ్, అబ్బాస్ సమీ, ఎండీ తాజుద్దీన్ పాల్గొన్నారు.