Share News

పాలిస్టర్‌ వస్త్రానికి కూలి పెంచివ్వాలి

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:04 AM

సిరిసిల్లలో పాలిస్టర్‌ వస్త్రానికి మరమగ్గాల కార్మికులతో పాటు అసాములకు తగ్గించి ఇస్తున్న కూలిని పెంచివ్వాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ డిమాండ్‌ చేశారు.

పాలిస్టర్‌ వస్త్రానికి కూలి పెంచివ్వాలి

సిరిసిల్ల రూరల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్లలో పాలిస్టర్‌ వస్త్రానికి మరమగ్గాల కార్మికులతో పాటు అసాములకు తగ్గించి ఇస్తున్న కూలిని పెంచివ్వాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ డిమాండ్‌ చేశారు. లేకుంటే ఈనెల 25న పాలిస్టర్‌ వస్త్ర వ్యాపార సంఘ భవనం ఎదు ట ధర్నా చేస్తామన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌ లాల్‌శుక్తా కార్మిక భవనంలో శనివారం సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్‌ మాట్లాడుతూ మరమగ్గాల కార్మికులు, వార్పి న్‌, వైపని కార్మికులు, అసాములకు కూలి ఒప్పందం గుడువు ముగి సినా యజమానులు పెంచడం లేదన్నారు. కూలి పెంచి వెంటనే నూతన ఒప్పందం చేయాలన్నారు. పాలిస్టర్‌ యాజమానులు ఆసా ములు, కార్మికులకు గత సంవత్సరం నుంచి కూలి తగ్గించి ఇస్తు న్నారని దీంతో కార్మికులకు సరైన వేతనాలు రాక ఇబ్బందులు ఎదు ర్కోంటున్నారన్నారు. అనేకసార్లు యాజమానుల సంఘానికి సంబం ధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా కూలి పెంచి ఇవ్వకుండా కార్మికులు, ఆసాములను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారన్నారు. ఇప్ప టికైనా యాజమానులు అసాములు, కార్మికులకు తగ్గించిన కూలి పెంచివ్వాలని, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి పాలిస్టర్‌ వస్త్రాని కి మరమగ్గాల కార్మికులు, అసాములు, వార్పిన్‌, వైపని కార్మికులకు కూలి పెంచాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 01:04 AM