Share News

ఓటరు రివిజన్‌ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:15 AM

రాష్ట్రంలో ఓటర్ల స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నిక ల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన హైదరా బాద్‌ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్‌, ఇతర అధికా రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారు లు, ఈఆర్‌వోలతో రివిజన్‌ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఓటరు రివిజన్‌ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి
వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పతి

కరీంనగర్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో ఓటర్ల స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నిక ల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన హైదరా బాద్‌ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్‌, ఇతర అధికా రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారు లు, ఈఆర్‌వోలతో రివిజన్‌ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్‌ జాబితాలో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్‌ జాబితా మాపింగ్‌ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని, కేటగిరీ-ఏలో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్‌ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరి-బిలో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, కేట గిరి-సిలో 1987 నుంచి 2002 మధ్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ-డిలో 2002-2007 మధ్యలో జన్మించిన వారీగా విభజించడం జరిగిందని అన్నారు. మొదటి కేటగిరీ-ఏ జాబితాను బీఎల్‌వో యాప్‌ ద్వారా నిర్ధారించుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల ఓటర్లును నిర్ధారించడం జరిగిందని అన్నారు. మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణను త్వరగా పూర్తిచేయాలని అన్నారు. కేటగిరి-సి, కేటగిరి-డిలోని ఓటర్లను కేటగిరి-ఎకు మ్యాపింగ్‌ చేసే ప్రక్రియ ను మెరుగుపరచాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్లు అశినీ తానాజీ వాకడే, లక్ష్మికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌బాబు పాల్గొన్నారు.

15కెఎన్‌ఆర్‌-1

--------------

5569 - సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పతి

-----------

క్లెయిమ్‌ చేయని ఆస్తులపై అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ పమేలాసత్పతి

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలికంగా క్లెయిమ్‌ చేయని ఆస్తులు (బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్‌, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌, షేర్లు)ను క్లెయిమ్‌ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి బ్యాంకు, బీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బ్యాంకు, బీమా, నియంత్రణ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. బ్యాంకు ఖాతాను ప్రారంభించే సమ యంలో అన్ని వివరాలు పూర్తిగా నింపి, నామినీ వివరాలు తప్పనిసరిగా రాయిం చాలని అన్నారు. పలువురు ఉద్యోగ, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించి నపుడు వివిధ ఆర్థిక సంస్థల్లో చేసిన పెట్టుబడులు క్లెయిమ్‌ చేయకుండా వదిలే శారని అన్నారు. దీనితో వారి అడ్రస్‌, కుటుంబ సభ్యుల వివరాలు తెలియక ఖాతాల్లోనే సొమ్ము ఉండిపోయిందని అన్నారు. ఆధార్‌, ఫోన్‌ వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్ల ఆస్తులు క్లెయిమ్‌ చేయనివి ఉన్నాయని, వీటిని అర్హులైన పౌరులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం యుడిజిఎఎం పోర్టల్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు. అక్టోబరు 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మీ డబ్బు .. మీ హక్కు నినాదంతో దీనిని గుజరాత్‌లో ప్రారంభించారని అన్నారు. సంబంధిత బ్యాంకులు, సంస్థల వద్దకు వెళ్లి మీ వద్ద ఉన్న సరైన పత్రాలు సమర్పించి నగదు పొందాలని ఖాతాదారులకు కలెక్టర్‌ సూచించారు. డిసెంబర్‌ 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, గ్రామాలవారీగా స్టాల్స్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పదేళ్లు ఖాతాను వినియోగించకుండా ఉంటే డెఫ్‌ ఫండ్‌లోకి వెళ్తుం దని, ఎవరైనా వివరాలు సమర్పిస్తే డెఫ్‌ నుంచి యాక్టివేట్‌ చేసి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ప్రతినిధులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ క్లీన్‌ చేయని డిపాజిట్లు, బీమా, పీఎఫ్‌ వంటి వాటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కెవైసీ, ఫోన్‌నెంబర్‌, అడ్రస్‌, అప్టేడ్‌ చేసుకోవాలని సూచించారు. ముందు చూపుతో ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అన్నారు. డీజీఎం సోలంకి మాట్లాడుతూ కలెక్టర్‌ చొరవతో రెండు నెలల్లో కొన్ని ఖాతాలను పరిష్కరించామని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌ శ్రీహరి మాట్లాడుతూ క్లెయిమ్‌ చేయని ఆస్తులను అర్హులకు అప్పగించాలనే ఉద్దేశంతో 90రోజుల ప్రచార కార్యక్రమాన్ని జిల్లాల వారీగా ప్రారంభించామని అన్నా రు. కార్యక్రమంలో యూబీఐ డీజీఎం అపర్ణరెడ్డి, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్‌, ఆర్‌బీఐ ఏజీఎం, నాబార్డ్‌, ఎల్‌ఎల్‌బీసీ, ఎల్‌ఐసీ, ఎల్‌డిఎం ఆంజనేయులు, రాయల్‌ సుంద రం, ఇపిఎఫ్‌వో బ్యాంకు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:15 AM