ముగిసిన పల్లె పంచాయతీ
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:00 AM
జిల్లాలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 85.66 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సుల్తానాబాద్ మండలంలో 86.51 శాతం, అత్యల్పంగా 83.73 శాతం పోలింగ్ నమోదు కాగా, పెద్దపల్లి మండలంలో 86.39 శాతం, ఓదెల మండలంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాదాద్, ఓదెల మండలాల్లోని 89 గ్రామ పంచాయతీల్లో 85 సర్పంచ్ స్థానాలు, 634 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటి పరిధిలో మొత్తం ఓటర్లు 1,44,563 మంది ఉండగా, 1,22,111 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
- మూడవ విడత పోలింగ్ 85.66 శాతం
- అత్యధికంగా సుల్తానాబాద్‌లో 86.51 శాతం
- అత్యల్పంగా ఎలిగేడులో 83.73 శాతం
- హరిపురం 6వ వార్డులో కొద్దిసేపు ఆగిన పోలింగ్
- పలు కేంద్రాల్లో చివరి నిమిషంలో వచ్చి వెనక్కి..
- శివపెల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే
(ఆంరఽధజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 85.66 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సుల్తానాబాద్ మండలంలో 86.51 శాతం, అత్యల్పంగా 83.73 శాతం పోలింగ్ నమోదు కాగా, పెద్దపల్లి మండలంలో 86.39 శాతం, ఓదెల మండలంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాదాద్, ఓదెల మండలాల్లోని 89 గ్రామ పంచాయతీల్లో 85 సర్పంచ్ స్థానాలు, 634 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటి పరిధిలో మొత్తం ఓటర్లు 1,44,563 మంది ఉండగా, 1,22,111 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 85 సర్పంచ్ స్థానాలకు 300 మంది అభ్యర్థులు, 634 వార్డు స్థానాలకు 1797 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓదెల మండలం హరిపురం 6వ వార్డు బూత్‌లో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న అభ్యర్థి పోలింగ్ ఏజెంట్‌గా కూర్చో వడంతో 47 ఓట్లు పడిన తర్వాత కొందరు గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్ది సేపు పోలింగ్ నిలిచిపోయింది. ఆయన స్థానంలో మరొకరు వచ్చిన తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. ఓదెల మండల కేంద్రం, తొగరాయి పోలింగ్ స్టేషన్ల వద్దకు ఒక నిమిషం ఆలస్యంగా ముగ్గురు, నలుగురు అభ్యర్థులు రాగా, వారిని లోపలికి అనుమతించక పోవడంతో ఓటు వేయకుండానే నిరాశతో తిరుగుముఖం పట్టారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 22.50 శాతం, 11 గంటల వరకు 57.21 శాతం, ఒంటి గంట వరకు 82.34 శాతం పోలింగ్ జరగగా, చివరి వరకు 85.66 శాతం పోలింగ్ నమోదైంది. 95 శాతానికి పైగా గ్రామాల్లో నిర్ణీత గడువులోనే పోలింగ్ పూర్తి కాగా, కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోనే అభ్యర్థులు ప్రచారం నిర్వహించేలా అవకాశం కల్పిం చారు. పోలింగ్ కేంద్రాలకు సెల్‌ఫోన్లను అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి సుల్తానాబాద్ స్టేషన్‌లో కూర్చుని పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ సందర్శించి పోలీస్ బందోబస్తును పరిశీలించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన శివపల్లిలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
ఫ మూడు విడతల్లో కలిపి 84.71 శాతం పోలింగ్..
జిల్లాలో మూడు విడతల్లో 262 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్, 2431 వార్డు స్థానాలకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 84.71 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని 98 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 82.27 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 73 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 86.20 శాతం పోలింగ్ నమోదైంది. మూడో విడతలో పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లోని 91 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, 85.66 శాతం పోలింగ్ జరిగింది.
ఫ మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలు..
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మెత్తం ఓట్లు పోలైన ఓట్లు
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం శాతం
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎలిగేడు 9088 9481 1 18570 7591 7838 0 15429 83.73
ఓదెల 17588 18219 0 35807 14808 15002 0 29810 84.70
పెద్దపల్లి 24989 25996 1 50986 21328 22010 1 43339 86.39
సుల్తానాబాద్ 19227 19973 0 39200 16560 16973 0 33533 86.51
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
70892 73669 2 144563 60287 61823 1 122111 85.66
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------