Share News

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:25 AM

ప్రజలను భాగస్వాములను చేస్తూ వన మహోత్సవం కార్యక్రమా లను విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు.

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ప్రజలను భాగస్వాములను చేస్తూ వన మహోత్సవం కార్యక్రమా లను విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. మంగళవారం హైదారాబాద్‌ నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణరావు ప్రభు త్వ ప్రాధాన్య కార్యక్రమాలపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖతతో ఆన్‌ లైన్‌ ద్వారా సమీక్ష నిర్వహించగా కలెక్టర్‌ సందీప్‌కుమా ర్‌ ఝా, అధికారులతో కలెక్టర్‌ కార్యాలయంలో హాజర య్యారు. వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల లభ్యత, ఆయిల్‌ఫామ్‌ పంటల విస్తరణ, సీజనల్‌వ్యాధు ల నియంత్రణ చర్యలు, భూభారతి ధరఖాస్తులు భూ భారతి దరఖాస్తుల పరిష్కారం లాంటి అంశాలపై సీఎస్‌ సుదీర్ఘంగా కలెక్టర్‌తో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడారు. రెండు లక్షల 30వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప త్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామని, లక్షకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు గ్రౌండ్‌వర్కులు అయ్యాయన్నారు. పెద్ద వర్షాలు కురవడానికి ముందే మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్‌ బేస్మెంట్‌ స్థాయి వరకు ని ర్మాణం జరిగేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ సీనరీజి చార్జీలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పెండింగ్‌ పనులు లబ్ధిదారులు పూర్తి చేసుకొనేల ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రస్తుతం ఎంత మేరకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరిగిందో ఎం బీ రికార్డులను నమోదుచేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటా యించాలని ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేసేం దుకు అవసరమైన నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందన్నారు. పీఎం ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0 కింద లక్షా 13వేల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రతిపట్టణం నుంచి కనీసం 500 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుచేయాలని కలె క్టర్‌కు సూచించారు. వన మహోత్సవం కార్యక్రమం కిం ద ఇళ్లకు పంపిణి చేసే మొక్కల పెంపకం సైతం పరి శీలించాలని మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్ష ణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లా ప్ర త్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసుకొని వన మహోత్స వం కార్యక్రమాలను నిర్వహించాలని, నాటిని మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కోఆర్డినేట్స్‌తో ఆన్‌ లైన్‌లో నమోదు చేయాలని సూ చించారు. ప్రతి జిల్లా ఎరువుల లభ్యత స్టాక్‌పై రివ్యూ పెట్టాలని జూలై వరకు అవసరమైన స్టాక్‌ ప్రస్తుతం అందుబాటులో ఉందని సెప్టెంబర్‌ నాటికి అవసరమైన ఎరువుల స్టాక్‌ ప్రొక్యూర్‌ చేస్తు న్నామన్నారు. లక్ష 25వేల ఎకరాల లో ఆయిల్‌ ఫామ్‌ పంట సాగు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకో వాలన్నారు. భూభారతి చట్టం రె వెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కారానికి చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులను నియంత్రించాలని పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నా రు. ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.

వన మహోత్సవంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నాలి

వన మహోత్సవంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాలని మంత్రి కొండ సురేఖ అ న్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్న మంత్రి కొండ సురేఖ మాట్లాడారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవాన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం లో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వరావు, డీఆర్డీవో శేషాద్రి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలిబేగం, డీసీవో రామ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారి రజిత, మున్సిప ల్‌ కమీషనర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:25 AM