వచ్చే దసరా పండుగను నూతన గృహంలో జరుపుకోవాలి
ABN , Publish Date - May 24 , 2025 | 12:47 AM
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదా రులు 30రోజుల్లోగా ప్రారంభించి వచ్చే దసరా, దీపావళి పండుగలు నూతన గృహాల్లో జరుపుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు.

గంభీరావుపేట, మే 23 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదా రులు 30రోజుల్లోగా ప్రారంభించి వచ్చే దసరా, దీపావళి పండుగలు నూతన గృహాల్లో జరుపుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. బుధవారం కలెక్టర్ గం భీరావుపేట మండలంలో రెండో విడత కింద 507 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వు లు కేకే మహేందర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ మండలంలో రెండో విడత కింద 507 లబ్ధిదారులను పార దర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం జరిగితే 4 దశలో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారీ నుంచి పైరవీ చేయాల్సిన అవస రం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుం దని, ఎవరికి ఒక రూపాయి ఇవ్వవద్దని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాల్లో అందుబాటులో పెడతామని తెలిపారు. మండలంలోని గ్రామాలకు ఇసుక రీచ్‌లను అలాట్ చేశామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ సెక్రెటరీ నుంచి తహసీల్దార్‌కు సమాచారం అందిస్తే వారే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తారని, ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారికి కూడా విడుదల ఎంపిక చేస్తామని తెలి పారు. 30 రోజులలోగా నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాలని లేని పక్షంలో మంజూరు చేసిన ఇళ్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకొని ప్రజల సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేద బడు గు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్ర మంలో పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి హన్మంతు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ విజయ, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీడీ వో రాజేందర్, తహసీల్దార్ మారుతిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.