Share News

నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:08 AM

నిబద్ధత తో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అన్నారు.

నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : నిబద్ధత తో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అన్నారు. కలెక్టరేట్‌లోని సమావే శ మందిరంలో శనివారం గ్రామ పాలన అధికారులకు కలె క్టర్‌ అధ్వర్యంలో నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రభుత్వం లో చాలా కీలకమని ప్రభుత్వ భూముల సంరక్షణ, ప్రైవేటు పట్టా భూముల రికార్డుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్‌ల జారీ వంటి అనేక కీలక బాధ్యతలు ఉంటాయ న్నారు. జిల్లాలో గ్రామపంచాయతీలకు గ్రామ పాలన అధికా రులను ప్రభుత్వం నియమించిందని, వీరు క్షేత్ర స్థాయిలో ప్రజలకు నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించాలని ఎక్కడా అవకతవకలకు పాల్పడటానికి వీలు లేదని స్పష్టం చేశారు. సిటిజన్‌చార్ట్‌ ప్రకారం ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చూడా లని అన్నారు. క్షేత్రస్ధాయిలో అదనపు కలెక్టర్‌, రెవెన్యూ డివిజన్‌ అధి కారులు, తహసీల్దార్‌లు తనిఖీలు నిర్వహిస్తారని, గ్రామపాలన అధి కారుల పనితీరు పర్యవేక్షిస్తారని తెలిపారు. మూడు సంవత్సరాల తర్వాత రెవెన్యూ శాఖకు గ్రామపాలన అధికారుల రూపంలో వీఆర్‌ వో, వీఆర్‌ఏ, జూనియర్‌ అసిస్టెంట్లు తిరిగి మాతృశాఖ రెవెన్యూ వస్తారన్నారు. నియామక పత్రాను స్వీకరించిన వారందరు విధుల్లో చేరాలని కలెక్టర్‌ అదేశించారు. సమావేశంలో కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 01:08 AM