కుంగిన రాజీవ్ రహదారి
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:40 AM
నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిపై మండలంలోని ఎల్‌ఎండి కాలనీ వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ గుంత ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురి అయ్యారు. ఓ భారీ వాహనం అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఒక్కసారిగా గుంత ఏర్పడింది.
తిమ్మాపూర్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిపై మండలంలోని ఎల్‌ఎండి కాలనీ వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ గుంత ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురి అయ్యారు. ఓ భారీ వాహనం అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఒక్కసారిగా గుంత ఏర్పడింది. గమనించిన ప్రయాణికులు వాహనాలు అటుగా రాకుండా గుంతలో చెట్ల కొమ్మలను ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న హెచ్‌కేఆర్ రోడ్‌వేస్ అధికారులు, సిబ్బంది ఆ స్థలానికి వచ్చి గుంత ఎలా, ఎందుకు పడింది అని పరిశీలించారు. గుంతలో ఇసుక నింపపారు. రాత్రి సమయంలో గుంత పడి ప్రమాదాలు జరిగి ఉండేవి. రాజీవ్ రహదారిపై అలుగునూర్ నుంచి రేణికుంట హెచ్‌కేఆర్ టోల్‌గేట్ వరకు పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. దీంతో వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేందుకు ఇబ్బంది పడుతున్నారు. గుంత పడడంపై హెచ్‌కేఆర్ డీజీఎం విజయ్‌భాస్కర్‌రెడ్డిని వివరణ కోరగా గతంలో రోడ్డు కింది భాగంలో వేసిన పైపులు దెబ్బతిన గుంతలు ఏర్పడతాయని, ఇలాంటివి సహజమన్నారు. రెండు మూడు రోజుల్లో రాజీవ్ రహదారిపై పడిన గుంతలను పూడ్చేస్తామని విజయ్‌భాస్కర్ రెడ్డి తెలిపారు.