Share News

యారన్‌ సబ్సిడీ డబ్బులు అందించాలి..

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:36 AM

బతుక మ్మ చీరలను తయారుచేసిన మరమగ్గాల కార్మికులకు యారన్‌ సబ్సిడీలు రాని వారందరికి చేనేత జౌళిశాఖ అధికారులు వెంటనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియ న్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ డిమాండ్‌ చేశారు.

యారన్‌ సబ్సిడీ డబ్బులు అందించాలి..

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : బతుక మ్మ చీరలను తయారుచేసిన మరమగ్గాల కార్మికులకు యారన్‌ సబ్సిడీలు రాని వారందరికి చేనేత జౌళిశాఖ అధికారులు వెంటనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియ న్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ డిమాండ్‌ చేశారు. అలాగే చేనేత జౌళిశాఖ కార్యాలయాన్ని సొంత భవనం లోనే కొనసాగించాలన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరమగ్గాల కార్మికులకు రావా ల్సిన యారన్‌ సబ్సిడీలను అందించడంతో పాటు సమ స్యలను పరిష్కరించాలని మరమగ్గాల కార్మికులతో ధర్నా చేసి కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సంద ర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ మాట్లాడుతూ సిరిసిల్లలో 2023 సంవత్సరంలో బతుకమ్మ చీరలకు సంబంధించి గత నెల రోజుల క్రితం మొదటి విడుతగా 3వేల మంది కార్మికుల ఖాతాల్లో పదిశాతం యారన్‌ సబ్సిడీ డబ్బులు జమ చేశారన్నారు. సిరిసిల్లతో పాటు టెక్స్‌టైల్‌ పార్క్‌లలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇంకా 2వేల 200 మంది కార్మికులకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉంద న్నారు. దీనిపై సంబంధిత అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు. రెండవ విడుత సబ్సిడీ డబ్బులు రాకపో వడంతో కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సబ్సిడీ డబ్బులు రావాల్సిన కార్మికులకు కాలయాపన చేయకుండా చేనేత జౌలిశాఖ అధికారులు వెంటనే వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌లో ఉన్న సొంత భవనంలోకి చేనేత జౌళిశాఖ కార్యాలయాన్ని తరలించి కార్మికులకు అందుబాటులోనే చేనేత జౌళిశాఖ సేవలను అందించే విధంగా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పట్టణ అధ్యక్షు డు నక్క దేవదాస్‌, కార్యదర్శి గుండు రమేష్‌, టెక్స్‌టైల్‌ పార్క్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కూచన శంకర్‌, నాయకులు బెజ్జుగం సురేష్‌, మూషం శంకర్‌, స్వర్గం శేఖర్‌, శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:36 AM