ఫలించిన పోరాటం
ABN , Publish Date - Jun 04 , 2025 | 03:51 AM
పదవీ విరమణ అనంతరం తమకు ఇచ్చే ప్రయోజనాలను పెంచాలని కొంత కాలంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న పోరాటం ఫలించింది. యేటా ఏప్రిల్ 30వ తేదీ నాటికి 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ఉంటుం దని, ఇప్పటి వరకు టీచర్లకు ఇస్తున్న లక్ష రూపాయలను 2 లక్షలకు, ఆయాలకు ఇస్తున్న 50 వేలు లక్ష రూపాయలకు పెంచు తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పదవీ విరమణ అనంతరం తమకు ఇచ్చే ప్రయోజనాలను పెంచాలని కొంత కాలంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న పోరాటం ఫలించింది. యేటా ఏప్రిల్ 30వ తేదీ నాటికి 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ఉంటుం దని, ఇప్పటి వరకు టీచర్లకు ఇస్తున్న లక్ష రూపాయలను 2 లక్షలకు, ఆయాలకు ఇస్తున్న 50 వేలు లక్ష రూపాయలకు పెంచు తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది ఎప్పటి నుంచి వర్తించనున్నదనే విషయమై ప్రభుత్వం జారీ చేసిన జీవో 8లో స్పష్టం చేయకపోవడంతో పదవీ విరమణ పొందిన టీచర్లు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు.
ఫ అంగన్‌వాడీ కేంద్రాల్లో 300 వరకు పోస్టులు ఖాళీ
రెండేళ్లలో దాదాపు 300 మందికి పైగా టీచర్లు, ఆయాలు పదవీ విరమణ పొందారు. జిల్లాలో 706 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 2024 ఏప్రిల్ 30 నాటికి 68 టీచర్ పోస్టులు, 227 హెల్పర్ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి మరిన్ని టీచర్, ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేసే టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ లేదు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తే తప్ప పోస్టులు ఖాళీ ఏర్పడేవి కావు. ఈ కేంద్రాల్లో 5 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిం చడంతోపాటు విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉంటుంది. బాలింతలు, గర్భిణీలకు సైతం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇవేగాకుండా ఇతరత్రా విధులను అంగన్‌వాడీ టీచర్లకు అప్పగిస్తారు. వీరి పదవీ విరమణకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విర మణ వయస్సును నిర్ధారించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్లు, కర్ణాట కలో 58 ఏళ్లు, తమిళనాడులో 60 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణను అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా 65 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని 2023 సెప్టెంబర్ 5వ తేదీన బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో 10 జారీ చేసింది. అప్పటి వరకు పదవీ విరమణ అనంతరం టీచర్లకు 60 వేలు, హెల్పర్లకు 30 వేల రూపాయల బెనిఫిట్స్ కింద ఇచ్చే వాళ్లు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం టీచర్లకు లక్ష, హెల్పర్లకు 50 పెంచుతూ జీవోలో పేర్కొంది.
ఫ పదవీ విరమణ ప్రయోజనాలు పెంచాలని పోరాటం..
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పదవీ విరమణ వయసు, కటాఫ్ నెలను ఖరారు చేసిన తర్వాత పదవీ విరమణ అనంతరం ఇచ్చే ప్రయోజనాలను రెండింతలు పెంచాలని పోరాటం చేశారు. జీవో 10 వెలువడిన అనంతరం ఇతర సమస్యలతో పాటు టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు ఒక రూపాయల బెనిఫిట్స్ ఇవ్వాలని 24 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం, అధికారులు ప్రయోజనాలను పెంచుతా మని హామీ ఇవ్వడంతో అక్టోబర్ 4న సమ్మె విరమించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో హామీ నెరవేరలేదు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యల పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో గతేడాది జూన్7న ఐసీడీఎస్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు. డైరెక్టర్ వారితో చర్చలు జరిపారు. జూన్ 17న మంత్రి సీతక్క మహబూబాబాద్ పర్యటనలో పదవీ విరమణ అనంతరం ఇచ్చే ప్రయోజనాలను పెంచుతామని ప్రకటించారు. కానీ అవేమి లేకుండానే ఏప్రిల్ 30 వరకు 65 ఏళ్లు నిండిన వారందరినీ తొలగించి, టీచర్లకు లక్ష, హెల్పర్లకు 50 వేల బెనిఫిట్స్ ఇవ్వాలని జూన్ 29న మెమో నంబర్. 1334/ఐసీడీఎస్-1/2024 జారీ చేశారు. ఆ మేరకు జిల్లాలో 26 మంది టీచర్లు, 73 మంది హెల్పర్లు ఉన్నట్లు గుర్తించి విధులకు హాజరు కావద్దని చెప్పారు. ఏడాది కాలంగా పదవీ విరమణ పొందిన చాలా మంది టీచర్లు, ఆయాలు పాత జీవో ప్రకారం ప్రయోజనాలను పొందలేదు. వారందరికీ పెంచిన ప్రకారం 2 లక్షలు, లక్ష ఇస్తారా, పాత జీవో ప్రకారం ఇస్తారా అనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక పోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. పెంచిన పదవీ విరమణ ప్రయోజనాలను 2024 జులై 1వ తేదీ నుంచి రిటైర్డ్ అయిన వారందరికీ వర్తింపజేయాలని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ బాధ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.