సమసమాజ స్థాపనకు పోరాటం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:47 AM
కేంద్రంలోని బీజేపీకీ సెక్యులర్ సోషలీజం పదాలంటే భయం, సమసమాజ స్థాపనకు ఎర్రజెండా పోరాటం చేస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీకీ సెక్యులర్ సోషలీజం పదాలంటే భయం, సమసమాజ స్థాపనకు ఎర్రజెండా పోరాటం చేస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సీపీఐ పట్టణ అధ్యక్షుడు పంతం రవి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావే శంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ప్రజా సమస్యలే ఎజెండాగా ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన కొరకు ఎర్రజెండా పోరాటం చేస్తుందన్నారు. ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య నిలబడి వారి సమస్యల పరిష్కారానికి పోరాడే పార్టీ సీపీఐ మాత్రమే అన్నారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని దున్నే వాడికి భూమి కావాలని శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి ప్రపం చానికి విప్లవ పాఠాలు నేర్పడంలో సీపీఐ నాయకత్వం వహించిందని అన్నా రు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయా లకు పాల్పడుతూ ప్రజా సమస్యలను విస్మరిస్తూ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. పేదవారి నడ్డి విరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం మల్లీ వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర ఇవ్వాలని ఎరువులు విత్తనాలు సబ్సిడీపైన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న మారణ హోమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్య దర్శి మంద సుదర్శన్, మాజీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు, అజ్జ వేణు, మీసం లక్ష్మణ్ పాల్గొన్నారు.