విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:34 AM
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నదని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఫార్మస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో అకాడమిక్ భవనం, హ్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య కోసం అవసరమయ్యే నిధులు సమకూరుస్తామని, విశ్వవిద్యాలయంలో నాణ్యత ప్రమాణాలు పెంచుతామన్నారు.
భగత్‌నగర్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నదని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఫార్మస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో అకాడమిక్ భవనం, హ్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య కోసం అవసరమయ్యే నిధులు సమకూరుస్తామని, విశ్వవిద్యాలయంలో నాణ్యత ప్రమాణాలు పెంచుతామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయం అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ యు ఉమేష్‌కుమార్ మాట్లాడుతూ విశ్వ విద్యాలయంలో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగాలను నింపేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. వచ్చే విద్యాసంవంత్సరం నుంచి కొత్త కోర్సులు తీసుకు వచ్చి శాతవాహన యూనివర్సిటిని తెలంగాణాలోనే మొదటి స్థానంలో నిలపడానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, పోలీస్‌కమిషనర్ గౌస్ అలం, శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్, ఓఎస్డీ డాక్టర్ హరికాంత్ పాల్గొన్నారు.
ఫ హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
శాతవాహన యూనివర్సిటీ ఫార్మసి కళాశాల అకడమిక్ బ్లాక్, ప్రహారి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు యూనివర్సిటీ వైన్స్ ఛాన్స్‌లర్ యు ఉమేష్‌కుమార్ స్వాగతం పలికి సత్కరించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ పీఎం ఉష నిధుల కింద అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. ఇందులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తాయన్నారు.
ఫ ఇన్‌చార్జి మంత్రికి ఘనస్వాగతం...
కరీంనగర్ అర్బన్: ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కలెక్టర్, ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి వద్ద మానకొండూర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ విగ్రహం వద్ద సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు మంత్రికి స్వాగతం పలికారు.
ఫ రోడ్డు మార్గంలో వచ్చి హెలీక్యాప్టర్‌లో తిరుగుప్రయాణం...
ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో కరీంనగర్‌కు వచ్చిన మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు కార్యక్రమం ముగిసిన హెలీక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. అత్యవసర కార్యక్రమం ఉండడంతో ఆలస్యమవుతుందని హెలీక్యాప్టర్ ద్వారా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ హైదరాబాద్‌కు వెళ్లారు.
ఫ మోడల్ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయలతో కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ మంత్రుల పర్యటన సందర్భంగా భారీ బందోబస్తుఏర్పాటు చేశారు. శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద, కలెక్టరేట్‌లోని ఆడిటోరియం వద్ద పోలీసులను మోహరించారు. ఆడిటోరియంలోకి ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు మినహా ఇతరులను అనుమతించలేదు. కలెక్టరేట్ గేట్ వద్దనే పోలీసులు అందరిని నిలిపివేశారు. సమావేశం ముగిసేవరకు గేట్-1ను మూసివేశారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, సిబ్బందిని రెండో గేట్ ద్వారా లోపలికి అనుమతించారు.