Share News

రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:08 AM

జనగామలో ఈనెల 28, 29న నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు అన్నారు.

రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జనగామలో ఈనెల 28, 29న నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు అన్నారు. గురువా రం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో సదస్సు పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్‌రావు, కోశాధికారి అంబటి రమేష్‌, కార్యదర్శులు కొత్వాల్‌ ప్రవీన్‌, కోటగిరి లక్ష్మణ్‌, తిరుపతిజాదవ్‌, గాలిపెల్లి సంతోష్‌, ఎంఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బెజగం సురేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 12:08 AM