Share News

తుది విడతకు రంగం సిద్ధం

ABN , Publish Date - Dec 03 , 2025 | 01:32 AM

పల్లె పంచాయతీల తుది విడత నామినేషన్లకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 12 మండలాల్లో 260 గ్రామసర్పంచ్‌లు, 2268 వార్డులకు సంబంధించిన ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

తుది విడతకు రంగం సిద్ధం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పల్లె పంచాయతీల తుది విడత నామినేషన్లకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 12 మండలాల్లో 260 గ్రామసర్పంచ్‌లు, 2268 వార్డులకు సంబంధించిన ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికి మొదటి విడతలో 80 సర్పంచ్‌లు, 722 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం పూర్తి అవుతుంది. ఈనెల 11న పోలింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. రెండవ విడతలో 88 సర్పంచ్‌ స్థానాలకు, 758 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ పూర్తి చేశారు. ఈనెల 3న పరిశీలన, 6 వరకు ఉపసంహరణలకు అవకాశం ఉంది. పోలింగ్‌ 14 నిర్వహిస్తారు. తుది విడత మంగళవారం ఈనెల 3 నుంచి నోటిఫికేషన్‌ జారీచేసి నామినేషన్లు స్వీకరిస్తారు. తుది విడతలో 87 గ్రామపంచాయతీలు, 762 వార్డులు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేటలో 26 సర్పంచ్‌లు, 226 వార్డులు ఉండగా, వీర్నపలిల్లో 17 సర్పంచ్‌లు, 132 వార్డులు ఉండగా, గంభీరావుపేటలో 22 సర్పంచ్‌లు, 202 వార్డులు, ముస్తాబాద్‌లో 22 సర్పంచ్‌లు, 202 వార్డులకు సంబంధించి 5వ తేది వరకు నామినేషన్లు స్వీకరించి, 6న పరిశీలన, 9 వరకు ఉపసంహరణలు, 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

రిజర్వేషన్లు ఇవీ..

తుది విడతలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లోని 87 సర్పంచ్‌లకు, 762 వార్డులకు ఎన్నికల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారు చేశారు. ఇందులో సర్పంచ్‌ స్థానాల్లో మహిళలు 39, జనరల్‌ 48 స్థానాలు ఉన్నాయి. వార్డుల్లో మహిళలు 330, జనరల్‌ 432 స్థానాలు రిజర్వు అయ్యాయి. ఎల్లారెడిపేటలో మహిళలు 12, జనరల్‌ 14 స్థానాలు ఉండగా, వార్డుల్లో మహిళలు 98, జనరల్‌ 128 స్థానాలు ఉన్నాయి. వీర్నపల్లిలో మహిళలు 8, జనరల్‌ 9 స్థానాలు ఉండగా, వార్డుల్లో మహిళలు 60, జనరల్‌ 72 స్థానాలు, ముస్తాబాద్‌లో మహిళలు 9, జనరల్‌ 13 స్థానాలు ఉండగా, వార్డుల్లో మహిళలు 45, జనరల్‌ 83 స్థానాలు, గంభీరావుపేటలో మహిళలు 10, జనరల్‌ 12 స్థానాలు ఉన్నాయి. వార్డుల్లో మహిళలు 89, జనరల్‌ 113 స్థానాలు కేటాయించారు.

తుది విడతలో 127920 మంది ఓటర్లు

జిల్లాలో 353351 మంది ఓటర్లు ఉండగా, మొదటి విడత ఎన్నికల్లో 114282 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడతలో 111129 మంది ఓటు వేయనున్నారు. ఇందులో 53792 మంది పురుషులు, 57337 మంది మహిళలు ఉన్నారు. మూడో విడతలో 127920 మంది ఓటు వేయనున్నారు. ఇందులో 61928 మంది పురుషులు, 65992 మంది మహిళలు ఉన్నారు.

తుది విడతలో గ్రామపంచాయతీ ఓటర్లు

మండలం పురుషులు మహిళలు మొత్తం

ఎల్లారెడ్డిపేట 19690 21196 40886

వీర్నపల్లి 5769 5958 11727

ముస్తాబాద్‌ 18658 19842 38500

గంభీరావుపేట 17811 18996 36807

మొత్తం 61928 65992 127920

తుది విడత సర్పంచ్‌ స్థానాలు

మండలం మొత్తం ఎస్టీలు ఎస్సీలు బీసీలు జనరల్‌

ఎల్లారెడ్డిపేట 26 04 05 05 12

వీర్నపల్లి 17 08 03 00 06

ముస్తాబాద్‌ 22 01 05 05 11

గంబీరావుపేట 22 03 04 05 10

------------------------------------------------------------------------------------------------

మొత్తం 87 16 17 15 39

------------------------------------------------------------------------------------------------

తుది విడత వార్డుల్లో స్థానాలు

మండలం మొత్తం ఎస్టీలు ఎస్సీలు బీసీలు జనరల్‌

ఎల్లారెడ్డిపేట 226 32 40 52 102

వీర్నపల్లి 132 66 14 09 43

ముస్తాబాద్‌ 202 10 44 47 101

గంబీరావుపేట 202 23 36 52 91

-------------------------------------------------------------------------------------------------

మొత్తం 762 131 134 160 337

-------------------------------------------------------------------------------------------------

Updated Date - Dec 03 , 2025 | 01:32 AM