బనకచర్ల పాపం ఆనాటి సీఎం కేసీఆర్‌దే..
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:45 AM
అపెక్స్ కమిటీ సమావేశానికి 2016లో హాజరైంది కేసీఆర్, హారీష్‌రావులేనని, కేసీఆర్, జగన్‌లు గోదావరి జిల్లాల విషయంపై సమావేశమై గోదావరి జలాలు తీసుకెళ్లాలని చెప్పింది కేసీఆర్ అని, బనకర్ల పాపం ముమ్మాటికి కేసీ ఆర్‌దేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
వేములవాడ కల్చరల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): అపెక్స్ కమిటీ సమావేశానికి 2016లో హాజరైంది కేసీఆర్, హారీష్‌రావులేనని, కేసీఆర్, జగన్‌లు గోదావరి జిల్లాల విషయంపై సమావేశమై గోదావరి జలాలు తీసుకెళ్లాలని చెప్పింది కేసీఆర్ అని, బనకర్ల పాపం ముమ్మాటికి కేసీ ఆర్‌దేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డితో కలిసి రాజన్నను దర్శించుకున్నారు. రాజన్న ప్రత్యేక దర్శ నం అనంతరం అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం విలేకర్లతో ఆది శ్రీనివాస్ మాట్లా డుతూ బనకచర్ల ప్రాజెక్ట్‌పై హరీష్‌రావు కామెంట్ చేయడం హేయమై న చర్య అన్నారు. బనకచర్ల పాపం బీఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. అబద్ధా లు ఆడటంలో హరీష్‌రావు దిట్ట అని, ప్రజలను తికమక పెడుతున్నార ని, హరీష్‌రావు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రాయలసీమను రతనాలసీమ గా మారుస్తానని అన్నది అబద్ధమా అని ప్రశ్నించారు. నాలుగు సార్లు జగన్, కేసీఆర్‌లు సమావేశమై గోదావరి నీళ్లను జగన్‌కు తీసుకుపొమ్మ ని చెప్పిన ఘనత కేసీఆర్‌దని మండిపడ్డారు. కాళేశ్వరంను కేవలం ఏటీఎంగా వాడుకున్నారని, కాళేశ్వరంతో వారి కుటుంబం బాగుపడింద ని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుక్క నీరు వాడకుండానే దేశంలో అత్యధికంగా మంచి పంటలు రాష్ట్రంలో పండాయని వివరించారు. బీజే పీ వైఖరి ఏంటనేది కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు.
క్రీడలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట..
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి మినిస్టేడియంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారులకు ఎల్లప్పుడు సహాయసహకారాలు అందిస్తా మని తెలిపారు. అనంతరం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి మా ట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడాకారులను, క్రీడలను ఏమాత్రం పట్టిం చుకోలేదన్నారు. బీఆర్‌ఎస్ 10 సంవత్సరాల కాలంలో క్రీడలకు రూ.400 కోట్లు కేటాయిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 11 నెలల్లోనే రూ. 800 కోట్లు కేటారుంచారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో క్రీడా సా మగ్రిని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.
పెద్దమ్మను దర్శించుకున్న విప్..
వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మీ వీధికి చెందిన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ, పోచమ్మ బోనాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని పట్టువస్ర్తాలను అందజేశారు.