Share News

మహనీయుల సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:41 AM

మహనీయుల సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ సందీఫ్‌కుమార్‌ ఝా కొని యాడారు.

మహనీయుల సేవలు చిరస్మరణీయం

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : మహనీయుల సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ సందీఫ్‌కుమార్‌ ఝా కొని యాడారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంతి రోశయ్య జయం తి వేడుకలతో పాటు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ, జిల్లా యువజన క్రీడాల శాఖ, జిల్లా బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో పాటు జిల్లా అధికారులు పాల్గొని మాజీ సీఎం రోశయ్య, దొడ్డి కొమురయ్యల చిత్రపట్టాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పిం చారు. ఈ ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి రాందాస్‌, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహార్‌రావు, జిల్లా అధికా రులు పాల్గొన్నారు.

17వ పోలీస్‌ బెటాలియన్‌లో..

సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్ధాపూర్‌ 17వ పోలీ స్‌ బెటాలియన్‌లో శుక్రవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి బెటా లియన్‌ కమాండెంట్‌ ఎంఐ సురేష్‌ పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ జగదీశ్వ ర్‌రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:41 AM