పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:14 AM
పాఠశాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సమగ్ర శిక్ష అభియాన్ జేడీ వెంకటనర్సమ్మ అన్నారు.
శంకరపట్నం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సమగ్ర శిక్ష అభియాన్ జేడీ వెంకటనర్సమ్మ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్ పాఠశాలను సమగ్ర శిక్ష అభియాన్ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులను కలిసి విద్యా, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, తరగతి గదులు, స్టోర్ రూమ్స్‌ను పరిశీలించారు. గదులు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంపై చర్చించారు.
ఫ జమ్మికుంట రూరల్: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను వరంగల్ ఆర్జెడి కె సత్యనారాయణ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో గణిత ల్యాబ్, బోధనా సామాగ్రిని, విద్యార్థుల యాక్టివిటీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గ్రంథాలయం అందుబాటులో ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు.