తుది విడతలో అదే హుషారు..
ABN , Publish Date - Dec 18 , 2025 | 01:00 AM
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తుది విడతలో ఓటర్లు అదే హుషారు తో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తుది విడతలో ఓటర్లు అదే హుషారు తో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చివరి విడతలో గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, ఎల్లారె డ్డిపేట మండలాల్లో 87గ్రామపంచాయతీలు ఉండగా ఏడు గ్రామపం చాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 762 వార్డు స్థానాలు ఉండగా 211 మంది అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 80 సర్పంచ్ స్థానా లు, 551వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంట ల నుంచి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవ డానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఎన్నికల్లో 79.16 శాతం పోలింగ్ నమోదయింది. పోలిం గ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకు న్నారు. పోలింగ్ కేంద్రాలను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పరిశీలించారు. నాలుగు మండలాల్లో 125324 మంది ఓటర్లు ఉండగా 99183 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇందులో పురుషులు 45747మంది,మహిళలు 53436 మంది ఉన్నారు. ఓటింగ్‌లో మహిళలు అధికంగా 7689 మంది ఓట్లు వేశారు.వీర్నపల్లి మండలంలో 11066 మంది ఓటర్లు ఉండగా ఉండగా, 9065 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.92శాతం నమోదు అయింది. ముస్తాబాద్ మండలంలో 37711 మంది ఓటర్లు ఉండగా, 30434 మంది ఓటు వేశారు. 80.70 శాతం, గంభీరావుపేట మండలంలో 36135 మంది ఉండగా, 28816 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. 79.75 శాతం నమోదు అయింది. ఎల్లారెడ్డిపేట మండలంలో 40412మంది ఉండగా, 30868మంది ఓటు హక్కు వినియోగించుకోగా 76.38 శాతం నమోదు అయింది. పోలింగ్ నిర్వహణకు 2158 మంది సిబ్బంది పాల్గొన్నారు.
చివరివరకు ప్రలోభ ప్రయత్నాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడో విడతలో జరిగిన నాలుగు మండ లాల్లో ఏడు గ్రామపంచాయతీలు, 211వార్డులు ఏకగ్రీవలు మినహా 80 సర్పంచ్ స్థానాల్లో 379 మంది,551 వార్డుల్లో 1526 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓటర్లు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పోలిం గ్ మోసే వరకు అభ్యర్థులు ప్రలోభ ప్రయత్నాలు కొనసాగించారు. ఓటుకు రూ 2 వేల నుంచి రూ 3 వేల వరకు పంపిణీ చేశారు. పోలిం గ్ చివర్లో రూ 4 వేల నుంచి రూ 5 వేల వరకు ఇచ్చిన సందర్భాలు కనిపించాయి. దీంతోపాటు ముందు రోజు మద్యం, డబ్బులు పంపిణీ జోరుగా సాగించారు.
భారీ పోలీసు బందోబస్తు
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా నాలుగు మండలాల్లో ఎస్పీ మహేష్ బిగితే పర్యవేక్షణలో 551 పోలింగ్ కేంద్రాల వద్ద 730 మంది పోలీస్ సిబ్బంది. అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. 33 రూట్లలో మొబైల్ బృందాలు, ఆరు జోనల్ బృందాలు, నాలుగు క్విక్ రియాక్షన్ బృందాలు, రెండు స్ట్రైకింగ్ బృందాలు పనిచేశాయి. నాలుగు మండలాల్లో 17 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.