Share News

మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయాలి

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:35 PM

సిరిసిల్ల, వేముల వాడ మున్సిపాలిటీల్లో బీజేపీకి మంచి వాతావరణం ఉందని, ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని, మీరంతా కలిసి ఉంటే ఈ రెండు మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.

మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయాలి

సిరిసిల్ల, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల, వేముల వాడ మున్సిపాలిటీల్లో బీజేపీకి మంచి వాతావరణం ఉందని, ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని, మీరంతా కలిసి ఉంటే ఈ రెండు మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బుధవా రం సిరిసిల్లలోని మణికంఠ ఫంక్షన్‌ హాలులో జిల్లా ముఖ్య నేతలతో సిరిసిల్ల, వేములాడ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు ముఖ్య నాయ కులంతా మున్సిపాలిటీల్లో పాదయాత్ర చేయాలని, బీజేపీ నాయకులంతా ఐక్యంగా ఉంటే సిరిసిల్ల, వేములవాడ మున్సి పాలిటీలను కైవసం చేసుకోవడం జరుగుతుందని, ఆశావహు ల జాబితాను రెడీ చేసి పంపాలని తెలిపారు. సర్వే ఆధారం గా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామన్నారు. సర్వే ఆధారం గానే టిక్కెట్ల పంపిణీ ఉంటుంది. టిక్కెట్‌ ఆశించడంలో తప్పు లేదని, గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు అర్ధం చేసుకుని పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. ఎన్నికల సమయంలో గొడవలు పెట్టుకునే నేతలను ఉపేక్షించబోమని హెచ్చరించా రు. వెంటనే షోకాజ్‌ నోటీసు జారీ చేస్తామని వెల్లడించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగ ళి అక్కడే అనే చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ రెండు మున్సిపా లిటీల్లో బీజేపీని గెలిపిస్తే... అభివృద్ధి అంటే ఏమిటో చూపి స్తామని ప్రజలకు విజ్ఝప్తి చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పాదయాత్ర చేసి ఇంటింటికీ వెళ్లాలని పిలుపునిచ్చారు. టిక్కె ట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావులేదని, సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు గుర్రాలకే పార్టీ నాయక త్వం బీజేపీ టిక్కెట్లు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. టిక్కె ట్ల కోసం తనతోపాటు తన కుటుంబసభ్యులకు ఫోన్లు కూడా చేయొద్దని, ఎవరైనా ఒత్తిడి తెస్తే వాళ్లకు వచ్చే టిక్కెట్లు కూడా రావని హెచ్చరించారు.

నామినేటెడ్‌ పోస్టులు దక్కేలా కృషి

టిక్కెట్లు రాకపోయినా పార్టీపరంగా, నా మినేటెడ్‌ పోస్టుల పరంగా వారికి న్యాయం చేస్తామని ఈసారి కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది నా మినేటెడ్‌ పోస్టులు దక్కేలా కృషి చేస్తామని సంజయ్‌ అన్నారు. ఎన్నికల సందర్భంగా టిక్కెట్ల కోసం, ఇతరత్రా విషయాల్లో గొడవ లకు దిగే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని టిక్కె ట్లు రాలేదనే కోపంతో పార్టీని వదిలివెళ్లాలనుకునే వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. సిరిసి ల్ల, వేములవాడ మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే అభి వృద్ధి అంటే ఏమిటో చూపిద్దామన్నారు. ఇందుకోసం రెండు, మూడురోజుల్లో రెండు మున్సిపాలిటీల పరిధిలో పాదయాత్ర స్టార్ట్‌ చేసి ఇదేవిషయాన్ని చెప్పి బీజేపీకి ఓటేసేలా ప్రచారం చే యాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ,మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్‌ రావు, ఎర్రం మహేశ్‌, కుమ్మరి శంకర్‌, బోయినిపల్లి ప్రవీణ్‌రా వు, అల్లాడి రమేష్‌,అడెపు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 11:35 PM