పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:11 AM
పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయమని ఎసీ మహేష్ బి. గితే అన్నారు.
చందుర్తి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయమని ఎసీ మహేష్ బి. గితే అన్నారు. చందుర్తి మండలం లింగంపెట గ్రామ శివారులోగల అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో కలసి ఎస్పీ నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సాయుధ పోలీసులు శోక్‌శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధి కారులు, సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్ర తల పరిరక్షణకు ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 8మందికి పైగా పోలీసులు అసువులు బాసా రని, వారి త్యాగఫలం వల్లే గతంకంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉంద ని, పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవస రం ఉందన్నారు. అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్య త అన్ని వర్గాల ప్రజలపై ఉందని, దేశ సరిహద్దుల్లోని ఆక్సాయ్‌చిన ప్రాంతంలో పహారాకాస్తున్న 10మంది సీఆర్పిఎఫ్ పోలీసులను 1959 లో ఇదేరోజున చైనా సైనికులు హతమార్చారని, అప్పటినుంచి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినం జరు పుకుంటున్నామన్నారు. కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుం బాల సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. పోలీస్ అమరవీరుల స్మరిస్తూ ఈనెల 21నుంచి 31వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు, సైకిల్‌ర్యాలీ, క్యాండిల్‌ర్యాలీ, 2కే రన్, ఓపెర్‌హౌస్, వ్యాసరచనపోటీలు, ఫోటో, వీడియో పోటీలు నిర్వహిస్తా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు వెంకటే శ్వర్లు, వీరప్రసాద్, శ్రీనివాస్, మొగిలి, శ్రీనివాస్, నటేష్, ఆర్‌ఐ రమేష్, యాదగిరి, ఎస్‌ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.