Share News

పోలీస్‌ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:50 AM

పోలీస్‌ అమరవీరుల త్యాగాలు స్పూర్తిదాయకమని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు.

పోలీస్‌ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

సిరిసిల్ల క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ అమరవీరుల త్యాగాలు స్పూర్తిదాయకమని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారో త్సవాల్లో భాగంగా బుధవారం విద్యార్థులకు ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సమాజంలో జరగుతున్న పరిణమాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా పోలీస్‌స్టేషన్‌ అంటే ఏమిటనేది తెలిసి ఉండాలని, ఇందుకోసమే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టౌన్‌ సీఐ కృష్ణ, ఆర్‌ఐ యాదగిరి, ఆర్‌ఎస్‌ఐలు శ్రావణ్‌, దీలీప్‌, పోలీస్‌సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:50 AM