Share News

‘సెస్‌’ అభివృద్ధికి పాలకవర్గం కృషి

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:50 AM

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం అభివృద్ధికి తమ పాలకవర్గం కృషి చేస్తోం దని, కావాలనే కొంతమంది అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు అన్నారు.

‘సెస్‌’ అభివృద్ధికి పాలకవర్గం కృషి

సిరిసిల్ల రూరల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం అభివృద్ధికి తమ పాలకవర్గం కృషి చేస్తోం దని, కావాలనే కొంతమంది అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు అన్నారు. సిరిసిల్ల సెస్‌ ప్రధాన కార్యాల యంలోని సమావేశ మందిరంలో బుఽధవారం ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సెస్‌ పాలకవర్గం రూ 14కోట్లు రెవెన్యూను ఉంచగా, తమ పాలకవర్గం వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో దానిని రూ.22 కోట్లకు పెంచి, సెస్‌ను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తోందన్నారు. సిరిసిల్ల పట్టణంలో విద్యుత్‌ అధికంగా ఉప యోగించడం వలన అంతరాయాలు ఏర్పడుతున్నాయని దానిని పరి ష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సిరిసిల్లలో ఎస్‌ఎస్‌ఐ యూనిట్‌ సభ్యులకు 25 హెచ్‌పీల కరెంట్‌ను ఉచితంగా ఇవ్వాలని ఈఆర్‌సీని ప్రత్యేకంగా కోరానన్నారు. విద్యుత్‌ సబ్సీడీపై నేతన్నలు తనను అపా ర్థం చేసుకోవద్దన్నారు. సెస్‌ పరిధిలో ఏ పనులు చేపట్టిన కూడా పాల కవర్గం తీర్మానంతో పాటు టెండర్‌లతోనే చేయిస్తామని, ఇందులో ఎక్క డా కూడా అవకతవకలు జరిగే ప్రసక్తి లేదన్నారు. సిరిసిల్ల, వేముల వాడ పట్టణాల్లో నిరంతరం కరెంట్‌ను సరఫరా చేసేందుకు ఆ పట్టణా లకు నలుదిక్కులా ఉన్న సబ్‌స్టేషన్‌ల నుంచి ప్రత్యేకంగా విద్యుత్‌ లైన్‌ లు వేయించామన్నారు. సిరిసిల్ల పట్టణానికి అదనంగా రెండు 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లు మంజూరు అయ్యాయని, రెవెన్యూ అధికా రులకు స్థలం ఇవ్వాలంటూ లెటర్‌లు ఇచ్చామని స్థలం చూపించిన వెంటనే సబ్‌స్టేషన్‌ల నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. సెస్‌ పరిధిలో గతంలో 36విద్యుత్‌ సబ్‌స్టేసన్‌లు ఉండేవని తాము పాలకవర్గం ప్రస్తు తం 85 సబ్‌స్టేషన్‌లకు పెంచామన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో 220కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరైందన్నారు. అలాగే నేరేళ్ల, బోయి న్‌పల్లిలలో 220 కేవీ సబ్‌స్టేషన్‌లు మంజూరు కావాల్సి ఉందన్నారు. సెస్‌లో పనిచేసేందుకు సిబ్బందితోపాటు హెల్పర్‌లు, ఏఈలు లేరని ఆ పోస్ట్‌లను భర్తీచేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్‌లు దార్నం లక్ష్మీనారాయణ, రేగులపాటి హరిచర ణ్‌రావు, వరుస కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:50 AM