Share News

నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకం

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:34 AM

నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీల కమని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు.

నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకం

సిరిసిల్ల క్రైం, జూలై 25(ఆంధ్రజ్యోతి): నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీల కమని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు. శుక్రవారం సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నూతనంగా నిర్మించిన జాగిలాల సంరక్షణ భవనాన్ని ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ జాగిలాలను నేర పరి శోధన, భద్రతా చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, విపత్తు పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. శిక్షణా సామర్థ్యం వల్ల విభిన్న ఆపరేషన్లలో జాగి లాలను వినియోగిస్తున్నామన్నారు. పోలీస్‌జాగిలాల సంరక్షణకు ప్రత్యేకంగా గదు లను నిర్మించామన్నారు. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌శా ఖకు కీలకంగా మారాయన్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమ యంలో నిందితులను పట్టించడంలోనూ, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో అత్యంత కీలక పా త్రను పోషిస్తున్నాయన్నారు. మాదక ద్రవ్యాలు, బాంబులు, ఇతర అనుమానస్పద వస్తువులను గుర్తించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. జిల్లాలో అనేక కేసులను చేధించడంలో, ఆధారాల సేకరణలోనూ వీటి పనితీరు ప్రశంసనీ యమన్నారు. పోలీస్‌ జాగిలాలకు ఆధునాతన శిక్షణ, వైద్య సంరక్షణ, తగిన సదు పాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నాలు గు జాగిలాలు ఉన్నాయన్నారు. వీటి నిర్వహాణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన హ్యాండ్లర్స్‌ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు కృష్ణ, మొగిలి, నటేశ్‌, ఆర్‌ఐలు రమేశ్‌, యాదగిరి, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డాగ్స్‌ హాండ్లర్స్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:34 AM