దేశాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకం
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:42 AM
భారతదేశ అభివృ ద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకమని నాప్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు.
గంభీరావుపేట, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : భారతదేశ అభివృ ద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకమని నాప్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట సింగిల్‌విండో కార్యాల యంలో అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొండూరు రవీందర్‌రావు మాట్లాడుతూ సహకార వ్యవస్థల రూపకర్త జవహార్‌లాల్ నెహ్రు జయంతిని పురస్కరించుకుని వారోత్సవాలను నిర్వ హించుకుంటున్నామన్నారు. సహకార సంఘాలు ఎంత పటి ష్టంగా ఉంటే దేశం ఆర్ధీకంగా అంత అభివృద్ధి చెందుతుంద న్నారు. సహకార సంఘాల సభ్యులే యజమానులని వెల్ల డించారు. సమష్టి కృషితో సంఘాలను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సహకార సం ఘాలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయ న్నారు. కార్యక్రమం లో డీసీవో రామకృష్ణ, కేడీసీసీబీ డైరెక్టర్ భూపతి సురెందర్, అసిస్టెంట్ రిజిస్టర్ రమాదేవి, బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, సీఈవో రాజిరెడ్డి,వైస్‌చైర్మన్ రామాంజనేయులు, సెస్‌డైరెక్టర్ నారాయణరావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు ఉన్నారు.