ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:49 AM
ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియో గించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు.
ముస్తాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియో గించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు. ముస్తాబాద్, పోతుగల్ నామినేషన్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. అలాగే వెంకట్రావుపల్లె చెక్‌పోష్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిం చే గ్రామపంచాయతీలకు వార్డులకు మూడో విడత నామి నేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో 24 గంటలు చెక్‌పోష్టు వద్ద పర్యవేక్షణ కొనసాగిస్తూ అక్రమ మద్యం, డబ్బు రావాణాను అరికట్టాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమా వళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఎవరు ఉల్లం ఘించిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 158 కేసుల్లో 657 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్పీ వెంట సీఐ మోగిలి, ఎస్సై గణేశ్‌లున్నారు.
ఎల్లారెడ్డిపేట : ఎన్నికల నిబంధనల మేరకు ప్రశాం తంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావియ్యకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఎస్పీ మహేష్.బి. గితే అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, హరిదాస్‌నగర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలతో పాటు పోలింగ్ కేం ద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. బందోబస్తు విధులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియ మావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నా రు. అక్రమ మద్యం, నగదు రవాణాను అరికట్టేందుకు తనిఖీలను ముమ్మరం చేశామని అన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఎస్పీ మహేష్. బి.గితే అన్నారు. ఆయన వెంట సీఐ శ్రీనివాస్ ఉన్నారు.
గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలోని జిల్లా సరిహద్దులోని పెద్దమ్మ చెక్‌పోస్ట్‌ను గురువారం ఎస్పీ మహేష్ బి గీతే తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్ని కల క్రమంలో చెక్‌పోస్ట్‌ల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేప ట్టాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం తరలిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకా రం సీజ్ చేయాలన్నారు. సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్‌ఐ అనిల్ కుమార్, సిబ్బంది ఉన్నారు.