Share News

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుచేయాలి

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:52 PM

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు.

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుచేయాలి

సిరిసిల్ల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. బుధవారం సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీ కృత కార్యాలయాల సముదాయంలో ఆయా శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సమాచార హక్కు చట్టం ఎలా అమ లులోకి వచ్చింది, చట్టంతో ప్రజలకు ఉపయోగపడే వివరాలను తెలియజేశారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ప్రభు త్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు తదితర సమా చారాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. దేశ భద్రత, రహస్య ఇతర ఇబ్బం దులు ఎదురయ్యే సమాచారం మినహా అన్ని ఇవ్వాలని సూచించారు. ప్రతి ప్ర భుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి వివరాలు ఉండాలని తెలిపారు. ఎవరైనా సమాచారం కోసం దరఖా స్తు చేసుకున్న 30రోజుల్లో వారికి సమాధానం ఇవ్వాలని సూచించారు. తెల్ల రే షన్‌ కార్డు ఉన్నవారికి సమాచారం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారు. ప్రభు త్వానికి సంబంధించిన సమాచారం అంతా ప్రజలకు అందుబాటులో ఉంచాల ని సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:52 PM