రిజర్వేషన్లు ఖరారు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే..
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:44 AM
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేష న్‌లను ఖరారుచేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేష న్‌లను ఖరారుచేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్టు తీర్పులో ఉన్నప్ప టికీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ముందుకు తీసుకవచ్చి బీజేపీని బద నాం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుచేయాల్సి న బీసీ రిజర్వేషన్‌లు 42శాతం ఎందుకు అమలుచేయడం లేదో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఇవ్వాలన్నారు. 243 ఆర్టికల్ ప్రకారం అమెండ్‌మెంట్ 73-74 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్‌లను ఖరారు చేసుకోచ్చని అన్నారు. అయినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాయకులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. 12 శాతం ఉన్న ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించాలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరే షన్‌పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందన్నారు. మైనార్టీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరే షన్‌ను అమలుచేయాలని చూస్తోందన్నారు. బీసీలను కాంగ్రెస్‌ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ ఉంటు బీసీ విద్యార్థులకు రావాల్సిన రూ.8వేల కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్‌లు తీసేసి 42 శాతాన్ని బీసీలకు కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేస్తే దానిని బీజేపీ ఆమోదిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఎప్పుడో ప్రకటించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మ్యాన రాంప్రసాద్, మహిళా మోర్చా జిల్లా మాజీ అఽధ్యక్షు రాలు బర్కం వెంకటలక్ష్మీ, నవీన్, మల్లారెడ్డి, సురేందర్‌రావు పాల్గొన్నారు.