విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాల్సిందే
ABN , Publish Date - May 21 , 2025 | 12:18 AM
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాలు విద్యాహక్కు చట్టాన్ని తాము అమలు చేయబోమని ప్రకటించడం సరి కాదని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు.
గణేశ్‌నగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాలు విద్యాహక్కు చట్టాన్ని తాము అమలు చేయబోమని ప్రకటించడం సరి కాదని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ నిబంధనలను పట్టించుకోకుండా ప్రైవేట్ పాఠశాలలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో తప్పనిసరిగా విద్య హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాల వారు ఈ విద్యాసంవత్సరం 15 నుంచి 30 శాతం ఫీజులు పెంచుకున్నార, ఫీజులు పెంచుకున్నప్పుడు పేద విద్యార్థులకు ఉచిత విద్య ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి 25 శాతం ఉచిత ఇవ్వని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.