రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:15 AM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతం గా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికలఅధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతం గా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికలఅధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైద రాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య అదన పు ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్ తో కలిసి సుదర్శన్‌రెడ్డి జిల్లా ఇన్ చార్జీ కలెక్టర్, అధికారులతో ఈఆర్ వోలతో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిలపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మొదటి కేటగిరి ఏ జాబితాను బీఎల్‌వో యాప్ ద్వారా నిర్ధారించుకో వడం జరుగుతుందని, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 63లక్షల ఓటర్లను నిర్ధారించామని, మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలన్నారు. కేటగిరి సీ, కేటగిరి డీ,లలోని ఓటర్‌లను కేటగిరి ఏకు మ్యాపిం గ్ చేసే ప్రక్రియను మెరుగుపర్చాలన్నారు. జిల్లా ఎన్ని కల అధికారి, ఇన్‌చార్జికలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లా డుతూ బీఎల్‌వోలు, సూపర్‌వైజర్ల ద్వారా ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా త్వరగా పూర్తి చేస్తామన్నారు. వీడియో కాన్సరేన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్‌కుమార్, వేములవాడ తహసీల్దార్ విజయ్‌ప్ర కాష్‌రావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎన్నికల అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.