Share News

కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:13 AM

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం, పత్తి, మక్కలు ఇతర పంటల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగా లని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అధికారులను అదేశించారు.

కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం, పత్తి, మక్కలు ఇతర పంటల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగా లని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అధికారులను అదేశించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో శుక్రవారం ఇన్‌చార్జి కలెక్టర్‌ కొనుగోళ్ల పై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం ఏయే పంటల ఉత్పత్తి ఎంత వస్తుందని జిల్లా వ్యవసాయాధికారిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం జిల్లాలో 238 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మం జూరుచేయగా ఇప్పటివరకు 171 కొనుగోలు కేంద్రాలు ఐకేపీ, సింగిల్‌విండో లు, మెప్మా, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయని, మిగతావి వారం రోజుల్లో ప్రారంభిస్తారని అధికారులు వివరించారు. ఈసందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం నాలుగు లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వ్యవసాయ అధికారులు అంచనా వేశారని తెలిపారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల 70వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి నట్లు వెల్లడించారు. ఈమేరకు అన్ని కొనుగోలు కేంద్రాలల్లో ప్యాడీ క్లీనర్లు, టార్పిన్‌లు, టెంట్‌లతోపాటు నీటి వసతి, విద్యుత్‌ కనెక్షన్‌లను పక్కాగా ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. గన్నీ సంచు ల కొరత లేదని ఇంకా కావాల్సినవి తెప్పించాలని ఆదేశించారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సీసీఐ ఆధ్వర్యంలో రైతులకు కపాస్‌ కిసాన్‌ యాప్‌పై అవగాహన కల్పించాలని కోరారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, ఆయా మండ లాల్లో రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, డీఅర్‌డీవో శేషాద్రి, డీసీఎస్‌వో చంద్రప్ర కాష్‌, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీబేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:13 AM